మన దేశంలో సొంత ఇల్లు కొనడం అనేది ఒక కల. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ రీత్యా ఒక నగరం నుండి మరో నగరానికి మారే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇప్పుడు అందరి చూపు ‘రెంటల్ హౌసింగ్’ (అద్దె ఇళ్లు) పై పడింది. మరికొద్ది రోజుల్లో రాబోతున్న బడ్జెట్ (Budget 2026) పై సామాన్యుల నుండి డెవలపర్ల వరకు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్ల మార్కెట్ ను ఒక పద్ధతిలోకి తీసుకురావడానికి కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్.
Read Also: Kaushik Reddy apology : పోలీసులకు క్షమాపణలు, కౌశిక్ రెడ్డి యూటర్నా?
అద్దె ఇళ్లకు ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ హోదా దక్కేనా?
ప్రస్తుతం మన దేశంలో అద్దె ఇళ్ల మార్కెట్ అంతా అసంఘటితంగా ఉంది. దీనిని ఒక ప్రొఫెషనల్ బిజినెస్ గా మార్చాలని నిపుణులు కోరుతున్నారు. ‘బిల్డ్-టు-రెంట్’ (అద్దె కోసమే ఇళ్లను నిర్మించడం) ప్రాజెక్టులకు బడ్జెట్ (Budget 2026) లో ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తారని బిల్డర్లు ఆశిస్తున్నారు. నిర్మాణ రంగంలో వాడే మెటీరియల్‌పై GST తగ్గించడం ద్వారా అద్దె ఇళ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల సామాన్యులకు తక్కువ ధరకే మంచి వసతులున్న ఇళ్లు లభిస్తాయి. ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో ఈ పన్ను విధానాన్ని సరళతరం చేస్తే.. సామాన్యులు కూడా ధైర్యంగా పెట్టుబడులు పెడతారు. దీనివల్ల డెవలపర్ల వద్ద నగదు లభ్యత పెరిగి, మరిన్ని అద్దె ఇళ్ల ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి. అద్దె కడితే లోన్ రావడం ఈజీ అవుతుందా? చాలా మంది యువ వృత్తి నిపుణులు తమ సంపాదనలో 30 నుండి 40 శాతం అద్దెకే ఖర్చు చేస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: