📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బడ్జెట్‌: నిర్మలా సీతారామన్‌

Author Icon By Vanipushpa
Updated: February 1, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టినప్పటికీ.. నిరసనల మధ్యే బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నారు. త్వరిత, సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బడ్జెట్‌ రూపొందించామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో కొద్దిసేపు క్రితమే ప్రవేశపెట్టారు. గత పదేండ్లలో సాధించిన అభివృద్దే తమకు స్ఫూర్తి అని, మార్గదర్శి అన్నారు. గత పదేండ్లలో సాధించిన అభివృద్ధి సంస్కరణలతో ప్రత్యేక గుర్తింపు సాధించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్‌ మెరుగైన పనితీరు సాధించిందన్నారు. ఈ సందర్భంగా దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అన్న గురజాడ సూక్తిని ప్రస్తావించారు.

మహిళల పట్ల దృష్టి సారించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధించ‌డం కోసం అంద‌రిని క‌లుపుకుపోతున్నామని తెలిపారు. ఇంధ‌న స‌ర‌ఫ‌రాను పెంపొందించేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వ్యవ‌సాయం, పెట్టుబ‌డుల‌పై ప్రధానంగా దృష్టి సారించామని, విక‌సిత భార‌త్‌లో స‌మ్మిళిత వృద్ధి ప్రధానంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ప‌థ‌కాల‌తో అధునాత‌న వ్యవసాయ ప‌ద్ధతుల‌ను తీసుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సంప‌ద‌ను సృష్టించ‌డం కోసం మ‌రిన్ని కార్యక్రమాలు అమ‌లు చేయ‌డానికి ప్రయ‌త్నిస్తామని తెలిపారు. నైపుణ్యాన్ని, టెక్నాల‌జీని పెంపొందించి గ్రామీణ ఆర్థిక వ్యవ‌స్థను పెంపొందిస్తున్నామన్నారు.

achieve investments Budget aims Nirmala Sitharaman parliament budget 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.