ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గారు పార్లమెంటులో ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1, 2026 న మన దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ రాబోతోంది. (Budget 2026) ఈసారి బడ్జెట్ ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతోంది. ఎందుకంటే భారత దేశ చరిత్రలో మొదటిసారిగా బడ్జెట్ ఒక ఆదివారం నాడు విడుదల కానుంది.
Read Also: America: ఎలాన్ మస్క్ vs రైయానైర్ సీఈఓ మాటల యుద్ధం
బడ్జెట్ 2026: ఈ కీలక పదాలు మీకు తెలుసా? బడ్జెట్ అనేది కేవలం లెక్కల పత్రం కాదు, అది మన దేశ ఖర్చుల చిట్టా. దీనిని అర్థం చేసుకోవడానికి ఈ పరిభాష ఉపయోగపడుతుంది..
1. ద్రవ్యోల్బణం (Inflation) సాధారణంగా వస్తువులు, సేవల ధరలు పెరగడాన్నే ద్రవ్యోల్బణం అంటారు. ధరలు పెరిగితే మన దగ్గర ఉన్న డబ్బు విలువ తగ్గుతుంది.
2. ఫిస్కల్ పాలసీ (Fiscal Policy) ప్రభుత్వం పన్నులు ఎలా వసూలు చేయాలి? ఏయే రంగాలకు ఎంత ఖర్చు చేయాలి? అని తీసుకునే నిర్ణయాలను ‘(ఫిస్కల్ పాలసీ)’ అంటారు. ఇది బడ్జెట్ ద్వారా అమలు చేయబడుతుంది.
3. ద్రవ్య విధానం (Monetary Policy) దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పర్యవేక్షిస్తుంది. మార్కెట్లో డబ్బు చలామణీని, వడ్డీ రేట్లను (Interest Rates) నియంత్రించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను అదుపులో ఉంచుతారు.
4. పెట్టుబడి వ్యయం (Capital Expenditure – Capex) ప్రభుత్వం ఆస్తులను సృష్టించడానికి చేసే ఖర్చు ఇది. అంటే రోడ్లు, రైల్వేలు, హాస్పిటళ్లు లేదా ఫ్యాక్టరీల నిర్మాణం కోసం చేసే ఖర్చు.
5. రెవెన్యూ వ్యయం (Revenue Expenditure) ప్రభుత్వం రోజువారీ నిర్వహణ కోసం చేసే ఖర్చు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు ఈ కేటగిరీలోకి వస్తాయి.
క్రిప్టో& డిజిటల్ అసెట్స్ (Crypto Tax)
ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై 30% పన్ను అమల్లో ఉంది. (Budget 2026) ఈసారి బడ్జెట్ లో క్రిప్టో పరిశ్రమకు సంబంధించి పన్నులను హేతుబద్ధీకరిస్తారా? లేదా? అనేది చూడాలి. ముఖ్యంగా 1% TDS విషయంలో కొంత ఉపశమనం లభిస్తుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు.
మొత్తంగా బడ్జెట్ అనేది దేశ భవిష్యత్తుకు దిక్సూచి వంటిది. ముఖ్యంగా టెక్నాలజీ, వ్యవసాయం, రక్షణ రంగాలకు ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో పెద్దపీట వేసే అవకాశం ఉంది. పైన వివరించిన పదాలను గుర్తుపెట్టుకుంటే.. ఈసారి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రసంగం మీకు చాలా తేలికగా అర్థమవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: