ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా యువతకోసం పలు సంస్కరణలు తీసుకురానుంది. ఇప్పటికే దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసింది. దీని ద్వారా నెలకు రూ.5 వేల స్టైఫండ్, ఏడాది పాటు శిక్షణ సహా పలు బెనిఫిట్స్ కల్పిస్తోంది. అయితే ఈ ఏడాది బడ్జెట్‌లో (Budget 2026) పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌లో (PM Internship Scheme) కీలక మార్పులు తేనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్టైఫండ్ రూ.11,800లకు పెంచుతారని సమాచారం. మార్చి 2026 నుంచి ఈ పెంపు ఉండేలా బడ్జెట్‌లో ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
Read Also: New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ
యువతను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు కేంద్రం నిర్ణయం
యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2024-25లో పైలట్ ప్రాజెక్ట్ గా పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ (Budget 2026) ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా ఏడాది పాటు ఉచిత శిక్షణ ఇవ్వడమే కాకుండా ఒక్కో అభ్యర్థికి రూ.60 వేల స్టైఫండ్ అందిస్తోంది. దీనిద్వారా కోటి మందిని నైపుణ్యవంతులగా తీర్చిదిద్ది వారికి ఉద్యోగావకాశాలు మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యం. దీన్ని మరింత విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో వార్షిక బడ్జెట్ 2026-27లో పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో కీలక మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
వీటికి సంబంధించి బడ్జెట్ 2026లో ప్రకటన చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే వయో పరిమితిని సైతం 18 నుంచి 30 ఏళ్లకు పెంచాలనే ఆలోచనలో ఉన్నారని కూడా తెలుస్తోంది. ప్రధానంగా పాలిటెక్నిక్, డిప్లమా, ఐటీఐల నుంచి వచ్చే యువతకు అధిక అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో చేరేందుకు వయసు 21- 24 మాత్రమే. ఈ స్కీమ్‌లో 12 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. శిక్షణ ముగించుకున్న తర్వాత అదనంగా రూ.6 వేలు స్టైఫండ్ అందిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.66 వేల స్టైఫండ్ లభిస్తుంది. బడ్జెట్‌లో స్టైఫండ్ పెరిగితే అది రూ.1,41,600 లకు చేరుకుంటుంది. యువతను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు స్టైఫండ్ పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: