AP Budget Updates 2026:దేశంలోని ఖనిజ వనరులు అధికంగా ఉన్న రాష్ట్రాలను పారిశ్రామికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా అరుదైన ఖనిజాల (Rare Earth Minerals) వెలికితీత, శుద్ధి మరియు పరిశోధనల కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ నాలుగు రాష్ట్రాల సహకారంతో ఒక ‘ప్రత్యేక మైనింగ్ మిషన్’ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.
Read Also: Budget: కేంద్రానికి వచ్చే ఆదాయ వినియోగం: షేరు, వ్యయం, ప్రాధాన్యతలు
ఏపీ తీర ప్రాంతానికి మహర్దశ
ఆంధ్రప్రదేశ్‌లోని 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతంలో మోనజైట్, ఇల్మెనైట్ వంటి అరుదైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కొత్త కారిడార్ల ఏర్పాటు వల్ల ఏపీ తీర ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు పెరగడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు రక్షణ రంగాలకు అవసరమైన ముడి పదార్థాల లభ్యత సులభతరం కానుంది. దీనివల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు మరియు ఉదాహి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్
భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే లక్ష్యంలో భాగంగా, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ‘ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్’ను నెలకొల్పనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 10,000 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కంటెయినర్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్న భారత్, ఈ నిర్ణయంతో ఎగుమతుల రంగంలో స్వయం సమృద్ధి సాధించనుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: