లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ‘పవిత్ర మాఘ పౌర్ణమి రోజున బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నాం. 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాం. వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం. గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాం’ అని అన్నారు. ‘ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే మా లక్ష్యం. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో కొత్త సంస్కరణలను తీసుకొస్తున్నాం’ అని తెలిపారు. ఈ బడ్జెట్‌ను ‘యువశక్తి బడ్జెట్’గా అభివర్ణించారు. మూడు కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించిన నిర్మలా.. నిర్మాణాత్మక సంస్కరణలతో వాటిని సాధిస్తామని చెప్పారు.
Read Also: Budget 2026: ₹54 లక్షల కోట్ల అంచనా, స్టాండర్డ్ డిడక్షన్ పెరుగుదల
‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ ఆధారిత బడ్జెట్
ఆగస్టు 2025 తర్వాత 350 సంస్కరణలు తీసుకువచ్చామని, ఆర్థిక ప్రణాళికలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ, లేబర్ కోడ్ వంటి రంగాల్లో సంస్కరణలు తెచ్చామని, నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామని, అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చూస్తామని ఆమె పేర్కొన్నారు. ఇది ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ ఆధారిత బడ్జెట్ అని, కర్తవ్యభవన్‌లో రూపొందించిన మూడో బడ్జెట్ అని ఆమె తెలిపారు.
భవిష్యత్తులో ఎగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తాం
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నిలకడగా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రధాని ఆలోచనలను ఆచరణలో పెట్టే బడ్జెట్ అని పేర్కొన్నారు. ఆర్థిక స్థిరాభివృద్ధికి ఆరు కీలక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. యువశక్తిపై దృష్టి పెట్టిన ఈ బడ్జెట్ ప్రపంచ మార్కెట్‌తో పోటీపడేలా ఉందని, ప్రపంచ అనిశ్చితుల మధ్య కూడా భారత్ వేగంగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఎగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తామని వెల్లడించారు.
physical discipline
లోక్ సభలో 3 కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించారు. ‘కర్తవ్యం-1: సమ్మిళిత ఆర్థిక వృద్ధి, కర్తవ్యం- 2: వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, కర్తవ్యం- 3: ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ సంస్కరణలతో కూడిన అభివృద్ధి మంత్రం.. ఫిస్కల్ డిసిప్లిన్‌ను సాధించాం. జనవరిలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1.93 లక్షల కోట్లు.. ఎకానమీలో నిలకడ వచ్చింది. ద్రవ్యోల్బణం మోడరేట్‌గా ఉంది’ అని తెలిపారు.
దక్షణాది రాష్ట్రాల్లో గనుల కారిడార్ల నిర్మాణం
కేంద్ర బడ్జెట్ 2026-27 (Budget 2026) లో బయో ఫార్మా రంగానికి రూ. 10 వేల కోట్లు కేటాయించారు. ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో గనుల కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్ ల నిర్మాణం, ప్రస్తుతమున్న NIPERs ఆధునీకరణ, దేశంలో 2 హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు చేయనున్నారు. కంటైనర్ నిర్మాణ రంగానికి కూడా రూ. 10 వేల కోట్లు కేటాయించారు.
దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం
ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి, నిలకడగా కొనసాగించడమే తొలి కర్తవ్యమని పేర్కొన్నారు. ఇందుకోసం ఆరు ప్రధాన రంగాల్లో ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. తయారీ రంగాన్ని విస్తరించడం, సంప్రదాయ పరిశ్రమలకు పునర్జీవం కల్పించడం, చాంపియన్ ఎంఎస్‌ఎంఈలను రూపొందించడం, మౌలిక సదుపాయాలకు బలమైన ఊపునివ్వడం, దీర్ఘకాలిక భద్రత, స్థిరత్వాన్ని నిర్ధారించడం, నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యమని నిర్మలా స్పష్టం చేశారు.
సెమీ కండక్టర్ 2.0
దేశ పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ రంగ విస్తరణకు మరిన్ని నిధులు కేటాయించింది. సెమీ కండక్టర్ 2.0 విధానాన్ని ప్రవేశపెట్టింది. కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో కీలక ఖనిజాల వెలికితీత పథకాన్ని ప్రారంభించింది. మూడు కొత్త రసాయన పార్కుల స్థాపన, భవన నిర్మాణ రంగంలో పరికరాల అభివృద్ధి, కంటైనర్ తయారీ పరిశ్రమ ప్రోత్సాహం, జాతీయ ఫైబర్ విధానం, జౌళి రంగ విస్తరణ, ఆధునీకరణ, ఉపాధి కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ చర్యలు దేశ పారిశ్రామికాభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.
హస్తకళాకారులకు ప్రోత్సాహం
బడ్జెట్ 2026–27లో టెక్స్‌టైల్ రంగానికి కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. సహజ ఫైబర్ల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో న్యాచురల్ ఫైబర్ స్కీమ్ ను, ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. టెక్స్‌టైల్ పరిశ్రమ విస్తరణతో పాటు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక టెక్స్‌టైల్ ఎక్స్‌పాన్షన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ ను అమలు చేయనుంది. అలాగే చేనేతలు, హస్తకళాకారులకు ప్రోత్సాహం ఇవ్వడానికి నేషనల్ హ్యాండ్‌లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రోగ్రామ్ హస్తకళాకారులకు ప్రోత్సాహం కూడా బడ్జెట్‌లో ప్రకటించింది. ఇవి గ్రామీణ ఉపాధి, సంప్రదాయ కళల పరిరక్షణకు దోహదపడనున్నాయి.
హైస్పీడ్ కారిడార్లు
ఏడు నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు ప్రకటించారు. ముంబయి-పుణె, పుణె-హైదరాబాద్, HYD-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-వారణాశి, వారణాశి -సిలిగుడి, చెన్నై-బెంగళూరు మధ్య ఏడు కారిడార్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇక గతేడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయించారు.
ఆరు ప్రధాన రంగాల్లో ప్రాధాన్యత
ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి, నిలకడగా కొనసాగించడమే తొలి కర్తవ్యమని పేర్కొన్నారు. ఇందుకోసం ఆరు ప్రధాన రంగాల్లో ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. తయారీ రంగాన్ని విస్తరించడం, సంప్రదాయ పరిశ్రమలకు పునర్జీవం కల్పించడం, చాంపియన్ ఎంఎస్‌ఎంఈలను రూపొందించడం, మౌలిక సదుపాయాలకు బలమైన ఊపునివ్వడం, దీర్ఘకాలిక భద్రత, స్థిరత్వాన్ని నిర్ధారించడం, నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యమని నిర్మలా స్పష్టం చేశారు.
ఆత్మనిర్భర్ భారత్ పథకానికి రూ.2వేల కోట్లు
ఆత్మనిర్భర్ భారత్ పథకానికి రూ.2,000 కోట్లు కేటాయించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణీకరణకు అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా ‘లోకల్ టు గ్లోబల్’, ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలను బలోపేతం చేయనున్నారు. స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహం, దిగుమతుల తగ్గింపు, ఆవిష్కరణల పెంపుతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక మద్దతు, మౌలిక వసతులు కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
సీ-స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సాయం
విదేశాల్లో ఉంటున్న భారతీయులకు (ఎన్నారైలకు) శుభవార్త అందింది. భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడుల పరిమితిని పెంచే అవకాశం కల్పించింది. మూలధన వ్యయాన్ని రూ.12.2 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీ-స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సాయం అందించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కొత్తగా డిడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సీ-స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ సహాయం
సీ-స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్తగా డిడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ ఏర్పాటు చేయనుంది. అలాగే అంతర్గత జలమార్గాలు, నౌకా సంరక్షణను బలోపేతం చేసేలా వారణాసి, పట్నాల్లో షిప్ రిపేర్ కర్మాగారాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాలు ఏర్పాటు
ప్రభుత్వం ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయనుంది. ఆతిథ్య రంగంలో జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పడంతో పాటు, 20 పర్యాటక ప్రాంతాల్లో పదివేల మంది గైడ్‌లను నియమించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) స్వయం సమృద్ధ భారతం పేరుతో రూ. 2,000 కోట్ల ఫండ్‌ను కేటాయించింది. ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా ఈ పరిశ్రమలకు చేయూత అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
డిడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ ఏర్పాటు
పర్యావరణహితమైన, తక్కువ ఖర్చుతో కూడిన సరుకు రవాణాను ప్రోత్సహించేందుకు తూర్పు భారతదేశంలోని దన్కుణి (పశ్చిమ బెంగాల్) నుండి పశ్చిమ తీరంలోని సూరత్ (గుజరాత్) వరకు ‘డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్’ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ కారిడార్ ద్వారా పారిశ్రామిక కేంద్రాల మధ్య సరుకు రవాణా వేగవంతం కావడమే కాకుండా, లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు.
కంటైనర్ల తయారీ కంపెనీలకు 10 వేల కోట్ల రూపాయలు
కంటైనర్లు తయారు చేసే పరిశ్రమలకు ₹10,000 కోట్లు కేటాయించారు. ఈ నిధులు పోర్టులు, రైల్వే కనెక్టివిటీ కోసం వినియోగించబడతాయి. తీర ప్రాంతాల్లో పోర్టులను బలోపేతం చేసి షిప్పింగ్ వాటాను పెంచే చర్యలు తీసుకుంటారు. వారణాసి, పాట్నాలో ఓడల మరమ్మతు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాయి. రాబోయే 5 ఏళ్లలో కంటైనర్ తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ఈ నిధులు వినియోగించబడతాయి.
మహిళా వ్యవస్థాపకుల కోసం ‘షీ-మార్ట్’
మహిళా వ్యవస్థాపకుల కోసం ‘షీ-మార్ట్’ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ ‘షీ మార్ట్స్’ బజార్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. దీని ద్వారా మహిళా వ్యవస్థాపకులు క్రెడిట్ లింక్డ్ ఉత్పత్తులు, వినూత్న ఆర్థిక సాధనాలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
(AI) ప్రభావం అంచనాకు హై లెవల్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అంచనాకు హై లెవల్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ కమిటీ వివిధ రంగాల్లో AI ప్రభావాన్ని, ఉద్యోగాలపై దాని ప్రభావాన్ని పరిశీలిస్తుంది. సర్వేలు, విశ్లేషణల ఆధారంగా AI అభివృద్ధి, నియంత్రణ, సమర్థ వినియోగానికి సంబంధించి చర్యలను సిఫార్సు చేయనుందని నిర్మలమ్మ తెలిపారు.
దేశీయ యాత్రలపై పన్ను తగ్గింపు
దేశీయ యాత్రలపై పన్ను తగ్గించనున్నట్లు కేంద్ర బడ్జెట్ 2026-27లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయం దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించి, ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన బడ్జెట్‌లో భాగంగా వెల్లడి కావడం, దేశీయ ప్రయాణికులకు శుభవార్తగా నిలిచింది. పన్ను తగ్గింపు వివరాలు, అమలు తేదీ వంటి అంశాలపై త్వరలో స్పష్టత రానుంది.
పర్యాటక రంగానికి పెద్దపీట
బడ్జెట్ 2026-27లో పర్యాటక రంగానికి పెద్దపీట వేశారు. జాతీయ పర్యాటక సంస్థ ఏర్పాటు చేసి, 20 పర్యాటక ప్రాంతాల్లో 10,000 గైడ్‌ల నియామకం చేయడం, MSMEలకు ప్రభుత్వ కొనుగోలు ద్వారా ప్రోత్సాహం వంటి చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. స్వయం సమృద్ధి భారత్ ఫండ్‌కు రూ.2వేల కోట్లు, సూక్ష్మ పరిశ్రమలకు రూ.2వేల కోట్లు కేటాయిస్తామని అన్నారు. 15 పురావస్తు ప్రాంతాలు అభివృద్ధి, పులికాట్ సరస్సులో పక్షుల వీక్షణకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తామని అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: