కేంద్ర బడ్జెట్ 2026 (Budget 2026) లో రైతాంగానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేశారు. ‘భారత్ విస్తార్’ పేరుతో కొత్త AI ఆధారిత డిజిటల్ టూల్‌ను ప్రకటించి, భాషా అడ్డులేకుండా రైతులకు పంటల, సాగు పద్ధతుల, ఆధునిక సాంకేతికతపై సమాచారం అందిస్తారు. ఒకే పంటపై ఆధారపడకుండా విలువైన పంటలు పండించేందుకు, గ్రామాల్లో కొత్త ఉపాధులు సృష్టించేందుకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించింది.
Read Also: Govt Revenue: కేంద్రానికి ఆదాయం ఎలా వస్తుందంటే..?
చెట్ల నాటడానికి ప్రోత్సాహం
కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం.. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్ల నాటకానికి ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు.జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు, గంధం చెట్ల వనాలు, బాదం, పైన్‌నట్స్ కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 500 రిజర్వాయర్లలో చేపల పెంపకానికి తోడ్పాటు అందిస్తామన్నారు. పశు సంవర్ధక శాఖలో భారీ ప్రోత్సాహకాలు, అధిక విలువ పంటలకు ప్రోత్సాహం, తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల నాటడానికి, ప్రోత్సాహం ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: