BSNL New Year offer: న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయమైన ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. 30 రోజుల వ్యాలిడిటీతో రూ.251 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు మొత్తం 100 జీబీ డేటాతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
Read Also: DRDO: ఢిల్లీకి ‘డోమ్’.. శత్రువులకు చుక్కలే
అంతేకాకుండా ఈ ప్లాన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ వినోద సేవ అయిన BiTV (BSNL Entertainment) ను అదనపు చార్జీలు లేకుండా వీక్షించవచ్చని తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. తక్కువ ధరలో భారీ డేటా, కాలింగ్ సదుపాయాలు ఇవ్వడంతో ఈ ప్లాన్‌పై వినియోగదారుల్లో ఆసక్తి పెరుగుతోంది.
ఆఫర్లు బాగున్నాయి, నెట్‌వర్క్ లేదు అంటున్న BSNL కస్టమర్లు
అయితే మరోవైపు, ఎంతమాత్రం ఆకర్షణీయమైన ఆఫర్లు తీసుకొచ్చినా నెట్‌వర్క్ సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదని పలువురు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కాల్ డ్రాప్స్, నెమ్మదిగా పనిచేసే ఇంటర్నెట్ వేగం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. బలమైన నెట్‌వర్క్ లభిస్తేనే ఇలాంటి ప్లాన్లు పూర్తిస్థాయిలో ఉపయోగపడతాయని, ఈ దిశగా సంస్థ తక్షణమే చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: