Bride cancels wedding for pet dog: పెంపుడు కుక్క కోసం పెళ్లి రద్దు

Read Time:  1 min
Bride cancels wedding for pet dog: పెంపుడు కుక్క కోసం పెళ్లి రద్దు
FONT SIZE
GET APP

Bride cancels wedding for pet dog: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఒక వివాహ వేడుక రణరంగంగా మారింది. ముహూర్తం సమయానికి అంతా సిద్ధమవుతున్న వేళ, ఒక చిన్న కారణం చివరకు పెళ్లి రద్దుకు దారితీసింది. వధువు ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్న కుక్క మరణించడంతో, మనస్తాపానికి గురైన వధువు తనకు ఈ సంబంధం వద్దంటూ తెగేసి చెప్పింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read Also: CM Revanth at AI Summit: ఏఐ సమ్మిట్‌లో సీఎం రేవంత్

కుక్క మొరిగిందని దాడి.. ప్రాణాలు కోల్పోయిన మూగజీవి

అసలు ఏం జరిగిందంటే.. పెళ్లి వేడుక జరుగుతుండగా వధువు పెంపుడు కుక్క వరుడి బంధువులను చూసి మొరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన వరుడి తరపు బంధువు ఒకరు ఆ కుక్కపై తీవ్రంగా దాడి చేశారు. ఆ దెబ్బలకు తాళలేక ఆ మూగజీవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తన కళ్ల ముందే ప్రాణప్రదమైన పెంపుడు జంతువు చనిపోవడంతో వధువు తట్టుకోలేకపోయింది. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, అది ఘర్షణకు దారితీసింది.

Bride cancels wedding for pet dog: Wedding canceled for pet dog
Bride cancels wedding for pet dog: Wedding canceled for pet dog

దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పెళ్లి బంధువులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.దీంతో కట్నకానులు పరస్పరం తిరిగి ఇచ్చిపుచ్చుకుని పెళ్లిని రద్దు చేసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.