📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Breaking News : రూ.17.53 కోట్లు చోరీ.. 2 నిమిషాల్లో షాక్!

Author Icon By Sai Kiran
Updated: August 16, 2025 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Breaking News : కష్టంతో సంపాదించేది కొద్దిగానైనా అది ఎంతో తృప్తినిస్తుంది. కడుపునిండా తినడమే కాదు, తృప్తిగా నిద్రపోయేలా చేస్తుంది. కానీ అక్రమంగా అన్యాయంగా సంపాదించి, లగ్జరీ లైఫ్ అనుభవించేవారు సుఖంగా జీవించలేరు. హాయిగా నిద్రపోలేరు. ఇతరుల కష్టార్జితంతో జీవించాలనుకోవడం పెద్ద తప్పే అవుతుంది. దొంగలు ఆ వృత్తిలో బాగా ఆరితేరిపోతారు. మనం సంవత్సరం అంతా కష్టపడ్డా దాచుకునేందుకు చాలావరకు మిగలదు. కానీ క్షణాల్లో మన కష్టార్జితాన్ని లూటీ చేసేస్తారు దొంగలు. ఇలాంటి సంఘటనే అమెరికాలో జరిగింది. సియాటెల్ నగరంలో ఓ నగల దుకాణంలోకి దొంగలు చొరబడి కేవలం రెండు నిమిషాల్లోనే 2 మిలియన్ డాలర్ల విలువైన నగలు Breaking News (రూ.17.53 కోట్లు) దోచుకెళ్లారు.

సీసీ కెమెరాల్లో రికార్డు..వైరల్

కాగా దుండగులు షాపులోకి ప్రవేశించి షాపును లూటీ చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇప్పుడా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వెస్ట్ సియోటెల్లోని మినాషే అండ్ సన్స్ నగల దుకాణంలో ఈ చోరీ జరిగింది. షాపులో అందరూ చూస్తుండగానే ఈ దోపిడీ జరిగినట్లు సీసీ కెమెరాల్లో స్పష్టంగా తెలుస్తున్నది. మాస్క్లు ధరించిన నలుగురు దుండగులు షాపుకు ఉన్న గ్లాస్ డోర్ను బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో అక్కడున్న సిబ్బందిని బెదిరించారు. అనంతరం డిస్ప్లేలో ఉంచిన ఆభరణాలు, లగ్జరీ వాచ్లను కొళ్లగొట్టారు.

90 సెకన్లలోనే దోచుకోవడం గమనార్హం

మొత్తం ఆరు డిస్ప్లే కేస్లలో ఉన్న వజ్రాభరణాలు, గడియారాలను దొంగలు దోచుకెళ్లినట్లు తెలిసింది. ఈ దోపిడంతా కేవలం 90 సెకన్లలోనే పూర్తి చేశారు. పోలీసులు అనుమానుతులను కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ, ఈ మొత్తం మరింత ఎక్కువ ఉండొచ్చని దుకాణం యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది.

Read also :

https://vaartha.com/war-2-box-office-collections-108-crores-in-2-days/cinema/531042/

Breaking News in Telugu crores robbery viral video Google News in Telugu internationalviralvideo Telugu News Today two minutes robbery Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.