📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Breaking News : తెలంగాణకు యూరియాను అడ్డుకుంటున్న మోడీ రేవంత్ రెడ్డి

Author Icon By Sai Kiran
Updated: August 20, 2025 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Breaking News : హైదరాబాద్ తెలంగాణ రైతాంగం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాను ప్రధాని మోదీ ఉద్దేశపూర్వకం గానే అడ్డుకుంటున్నారని, ఇది తెలంగాణపై Breaking News ఆయనకున్న వివక్షకు నిదర్శనమని విమర్శించారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

రాష్ట్ర రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, సరిపడా యూరియాను పంపించాలని లేఖలు, విజుప్తుల రూపంలో ఎన్నిసార్లు కోరినా కేంద్రం నుంచి స్పందన రావడం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఈ మొండి వైఖరిని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో గట్టిగా ఎండగట్టారని ఆయన ప్రశంసించారు.

ఈ విషయంలో తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిలిచి, రైతుల పక్షాన గొంతు విప్పిన ఎంపీ ప్రియాంక గాంధీకి ఆయన ఎక్స్ వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ పైనా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

కేవలం మోదీ భజనకే పరిమి తమయ్యారని దుయ్యబట్టారు

రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన వారు, తమ బాధ్యతను మరిచి కేవలం మోదీ భజనకే పరిమి తమయ్యారని దుయ్యబట్టారు. మరోవైపు, బీఆర్ఎస్ ఎంపీల తీరుపైనా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “గల్లీలో లొల్లి చేసే బీఆర్ఎస్ నేతలు, ఢిల్లీలో రైతుల సమస్యలపై మోదీని ప్రశ్నించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? మోదీ అంటే భయమా లేక భక్తా?” అని సీఎం ప్రశ్నించారు. రైతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సమయంలో పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు కనిపించకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు.

Read also:

https://vaartha.com/mohammed-kaif-axar-patel-should-be-given-an-explanation-as-to-why-he-was-removed-from-the-vice-captaincy/sports/533202/

breaking news latest news Latest Telugu News Modi blocking urea Telangana News Revanth Reddy on urea shortage Revanth slams Modi urea Telangana agriculture crisis Telangana farmers fertilizer problem Telangana urea issue TeluguNews todaynews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.