Whatsapp chat divorce case : బాంబే హైకోర్టు విడాకుల కేసులో ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. కేవలం సందేశాల ఆధారంగా మాత్రమే భార్యాభర్తల మధ్య విడాకులు మంజూరు చేయలేమని స్పష్టం చేసింది.
నాసిక్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఒక భర్త, తన భార్యతో జరిగిన మొబైల్ సందేశాలను ఆధారంగా చూపిస్తూ విడాకులు కోరాడు. భార్య తనపై ఒత్తిడి తెచ్చిందని, కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నాడు.
ఈ సందేశాలను ఆధారంగా తీసుకున్న నాసిక్ కుటుంబ న్యాయస్థానం భర్తకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భార్య ప్రవర్తన వల్ల భర్తకు మానసిక ఇబ్బందులు కలిగాయని పేర్కొంటూ విడాకులు మంజూరు చేసింది.
Read Also: Funky Movie: విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్?
అయితే ఆ తీర్పును భార్య బాంబే హైకోర్టులో సవాలు చేసింది. తన వాదనలు వినిపించే అవకాశం దిగువ న్యాయస్థానం ఇవ్వలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొంది.
విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నాసిక్ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. కేవలం మొబైల్ సందేశాలను మాత్రమే ఆధారంగా తీసుకొని విడాకులు ఇవ్వడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.
ఈ కేసును మళ్లీ విచారణ కోసం నాసిక్ కుటుంబ న్యాయస్థానానికి తిరిగి పంపింది. భార్యకు తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని, అవసరమైతే ఈ దంపతులు తిరిగి కలిసి జీవించే మార్గాలను కూడా పరిశీలించాలని సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: