📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Bombay High Court: బిడ్డకు తండ్రైనా  పోక్సో కేసు వర్తిస్తుంది: హైకోర్టు

Author Icon By Sushmitha
Updated: October 1, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుని బిడ్డకు తండ్రయినంత మాత్రాన నిందితుడికి పోక్సో(Posco) చట్టం కింద నమోదైన కేసు నుంచి విముక్తి లభించదని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాధితురాలిని పెళ్లి చేసుకోవడం అనేది చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి మార్గం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు తనపై, తన కుటుంబంపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ 29 ఏళ్ల యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Read Also: AP Government: చిన్న కాంట్రాక్టర్‌లకు శుభవార్త.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

అకోలా కేసు వివరాలు, నిందితుడి వాదన

మహారాష్ట్రలోని అకోలాలో 29 ఏళ్ల యువకుడు 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో బాలిక కుటుంబ సభ్యులు నిందితుడికే ఇచ్చి వివాహం జరిపించారు. ఈ ఏడాది మే నెలలో ఆ బాలిక ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం జూలైలో నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసులు పెట్టారు.

నిందితుడి తరఫు న్యాయవాదులు, తమ మధ్య ఉన్నది ఇష్టపూర్వక సంబంధమని, ఆమెకు 18 ఏళ్లు నిండాక చట్టబద్ధంగా వివాహం చేసుకున్నామని వాదించారు. ఒకవేళ అతడిని శిక్షిస్తే, బాధితురాలు, తమ బిడ్డ సమాజంలో ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. బాధితురాలు కూడా ఎఫ్ఐఆర్ రద్దుకు అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపింది.

హైకోర్టు వ్యాఖ్యలు: మైనర్ సమ్మతికి విలువ లేదు

ఈ వాదనలను పరిశీలించిన జస్టిస్ ఊర్మిళ జోషి(Justice Urmila Joshi) ఫాల్కే, జస్టిస్ నందేశ్ దేశ్‌పాండేలతో కూడిన నాగ్‌పూర్ ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది. “పోక్సో చట్టం యొక్క ముఖ్యోద్దేశం 18 ఏళ్లలోపు పిల్లలను లైంగిక నేరాల నుంచి కాపాడటమే. ఈ చట్టం ప్రకారం, మైనర్ల విషయంలో వారి సమ్మతికి చట్టపరంగా ఎలాంటి విలువ లేదు” అని కోర్టు స్పష్టం చేసింది. వివాహం జరిగినప్పుడు, బిడ్డకు జన్మనిచ్చినప్పుడు కూడా బాధితురాలి వయసు 18 ఏళ్లలోపే ఉందని ధర్మాసనం గుర్తు చేసింది.

నిందితుడి చర్యలు చట్ట విరుద్ధం

నిందితుడి వయసు 27 ఏళ్లు అని, ఆమెకు 18 ఏళ్లు నిండేవరకు ఆగాల్సిందనే స్పృహ అతనికి ఉండాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. కేవలం బాధితురాలిని పెళ్లి చేసుకుని, బిడ్డ ఉన్నారన్న కారణంతో నిందితుడు చేసిన చట్ట వ్యతిరేక చర్యలను పక్కన పెట్టలేమని తేల్చిచెబుతూ, కేసును రద్దు చేయడానికి ఇది సరైనది కాదని పేర్కొంది.

పోక్సో కేసును రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించడానికి కారణం ఏమిటి?

నిందితుడు మైనర్ బాలికను వివాహం చేసుకుని, వారికి బిడ్డ పుట్టినందున ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరాడు.

ఈ కేసులో హైకోర్టు ప్రధాన వ్యాఖ్య ఏమిటి?

మైనర్ల విషయంలో వారి సమ్మతికి పోక్సో చట్టం ప్రకారం చట్టపరమైన విలువ లేదని కోర్టు స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

bombay high court child marriage. Google News in Telugu Latest News in Telugu legal verdict marital rape POCSO Act Telugu News Today Urmila Joshi Phalke

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.