Latest News: Bombay High Court- రోడ్ల మీద గుంతల వల్ల చనిపోతే ఆనష్టం మున్సిపాలిటీ ఏ తీర్చాలి

Read Time:  1 min
Bombay High Court
Bombay High Court
FONT SIZE
GET APP

రోడ్లపై ఏర్పడే గుంతలు, బంకర్లు, ఆపద్స్థితుల కారణంగా ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నో. సాధారణంగా మనం వాటిని తాత్కాలిక సమస్యలుగా భావిస్తుంటాం. చిన్న గుంతలు ఉన్న రోడ్లపై గమనిస్తూ, జాగ్రత్తగా కదలడం అలవాటు చేసుకున్నాము. అయితే కొన్ని సందర్భాల్లో, రోడ్డు నాణ్యత, గుణాత్మకత లోపాలు, మార్గదర్శకతలేమి కారణంగా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి.రోడ్ల మీద ఉన్న గుంతల కారణంగా జరిగే ప్రమాదాలకు మున్సిపల్‌ కార్పొరేషన్ల (Municipal corporations) ను బాధ్యుల్ని చేస్తూ.. ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించగలదా అంటూ బాంబే హైకోర్టు.. మహారాష్ట్ర సర్కార్‌ని ప్రశ్నించింది.

రోడ్ల మీద ఏర్పడే గుంతల కారణంగా ప్రమాదాలు సంభవించి గాయపడటం, చనిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటే.. వాటికి సదరు మున్సిపాలిటీలు, అధికారులను బాధ్యులను చేయాలని బాంబే హైకోర్టు (Bombay High Court) తెలిపింది.అలానే రోడ్ల మీద గుంతల వల్ల ఏర్పడే ప్రమదాల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించేందుకు ఓ విధానాన్ని రూపొందించడానికి మహారాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉందో లేదా అని ధర్మాసనం ప్రశ్నించింది.

రోడ్ల దుస్థితికి కాంట్రాక్టర్లను కూడా బాధ్యులుగా

దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమాచారాన్ని తమకు తెలపాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది ఓఎస్‌ చందూర్కర్‌ని.. జస్టిస్‌ రేవతీ మొహితే, జస్టిస్‌ సందేశ్‌ బీ పాటిల్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇలాంటి ప్రమాదాలకు మున్సిపల్‌ కార్పొరేషన్లను బాధ్యుల్ని చేయాలన్న కోర్టు.. పరిహారం మొత్తాన్ని కూడా మున్సిపల్‌ అధికారుల (Municipal officials) జీతాల నుంచే రాబట్టాలని సూచించింది.అలానే ఈ ప్రమాదాలకు కారణమైన వారికి చిన్న జరిమానా సరిపోదని..

Bombay High Court
Bombay High Court

వారికి కూడా నొప్పి తెలియాలంటే భారీ మొత్తంలో జరిమానా విధించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. రోడ్లపై గుంతల వల్ల సంభవిస్తున్న మరణాలపై తాజాగా బాంబే హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రోడ్ల దుస్థితికి కాంట్రాక్టర్లను కూడా బాధ్యులుగా చేయాలని బీఎంసీతో పాటుగా.. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (Mumbai Metropolitan Region) లోని అన్ని మున్సిపాలిటీలకు కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.ఈక్రమంలో కాంట్రాక్టర్లకు రూ.1 లక్ష-రూ. 10 లక్షల వరకు జరిమానాలు విధించినట్లు న్యాయవాది తెలపగా..

తాము విస్తృతమైన అంశంగా పరిగనిస్తున్నామన్న

కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందుతున్న వారికి ఈ జరిమానాలు సరిపోవని ధర్మాసనం అభిప్రాయపడింది. వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ సమస్యను తాము విస్తృతమైన అంశంగా పరిగనిస్తున్నామన్న హైకోర్టు.. రోడ్డు మీద గుంతల కారణంగా ఎవరైనా చనిపోతే.. లేదంటే గాయపడితే.. అందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించింది. ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/karnataka-urban-domestic-workers-social-security-bill/national/550779/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.