Bombay High Court: స్వదేశంలో రోడ్లపై నిర్లక్ష్యంగా చెత్త వేస్తూ.. విదేశాలకు వెళ్లగానే క్రమశిక్షణతో నిబంధనలు పాటించే పౌరుల ద్విముఖ వైఖరి (Hypocrisy) పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి ఇచ్చే మూల్యం ఇదేనా?” అని జస్టిస్ జి.ఎస్. కులకర్ణి, జస్టిస్ ఆర్తి సాథేల ధర్మాసనం ప్రశ్నించింది. కంజుర్‌మార్గ్ డ్రంపింగ్ గ్రౌండ్ సమీపంలో కాలుష్యం, దుర్వాసన మరియు ఆరోగ్య సమస్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా న్యాయస్థానం పౌర బాధ్యతలను గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Read Also :Abhijit Dipke: క్షమించడం కాదు.. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి: మోదీకి దిప్కే సవాల్
న్యాయస్థానం చేసిన కీలక వ్యాఖ్యలు & ఆదేశాలు
- హక్కులతో పాటు బాధ్యత: స్వచ్ఛమైన వాతావరణంలో జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉన్నట్లే, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత కూడా పౌరులపైనే ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.
- పౌరుల నిర్లక్ష్యంపై అసహనం: చాక్లెట్ రేపర్‌ను కూడా ఆలోచించకుండా రోడ్డుపై పడేసే ప్రజలు, విదేశాల్లో మాత్రం డస్ట్బిన్లలోనే వేస్తారని మండిపడింది. ముంబై తీరప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్న తీరును చూస్తుంటే “మనం అసలు నాగరిక సమాజంలో జీవిస్తున్నామా?” అని ధర్మాసనం ప్రశ్నించింది.
- ‘సుందర్ ముంబై’ ముద్రకు భంగం: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC/MCGM) ఉపయోగిస్తున్న ‘స్వచ్ఛ ముంబై, సుందర్ ముంబై’ లక్ష్యాన్ని పౌరుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం దెబ్బతీస్తున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.
- నిర్దాక్షిణ్యంగా చర్యలు: రోడ్లను డపింగ్ యార్డులుగా మార్చే వారిపై బీఎంసీ వార్డుల వారీగా కఠిన యంత్రాంగాన్ని అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై అత్యంత నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Bombay High Court: హెరిటేజ్ ప్రదేశాల వద్ద చెత్త ట్రక్కులు: బీఎంసీకి హెచ్చరిక
రాజాబాయి టవర్స్, హైకోర్టు భవనం వంటి చారిత్రాత్మక వారసత్వ ప్రదేశాల (Heritage Sites) వద్ద బీఎంసీ చెత్త ట్రక్కుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల విదేశీ పర్యాటకుల ముందు దేశ ప్రతిష్ట దిగజారుతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
కోర్టు తీవ్ర హెచ్చరిక: ఈ సమస్యపై వారం రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. లేనిపక్షంలో తామే స్వయంగా కఠినమైన ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :