📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Bomb Threats: సీఎం స్టాలిన్‌ సహా సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు

Author Icon By Anusha
Updated: November 17, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులో సీఎం ఎంకే స్టాలిన్తో పాటు ప్రముఖ నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బూ సుందర్ నివాసాలను ఆదివారం రాత్రి బాంబు బెదిరింపులు (Bomb Threats) వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డీజీపీ కార్యాలయానికి ఆ బెదిరింపు మెయిల్‌ వచ్చింది.అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు.. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీల చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో అది బూటకపు బెదిరింపుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: Trisha: రూమర్ల వార్తలను ఖండించిన త్రిష

గత కొన్నిరోజులుగా వరుస బాంబు బెదిరింపులు

కాగా, తమిళనాడులోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు గత కొన్నిరోజులుగా వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats In Chennai) వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, టీవీకే చీఫ్‌, ప్రముఖ నటుడు విజయ్‌, ప్రముఖ నటులు త్రిష, నయనతార, ప్రభు, రజినీకాంత్‌, ధనుష్‌, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజా (Ilaiyaraaja) స్టూడియోస్‌, బీజేపీ ప్రధాన కార్యాలయానికి,

డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్‌, చెన్నైలోని అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ మెయిల్స్‌ ద్వారా బాంబు బెదిరింపులు (Bomb Threats) వచ్చాయి. చెన్నైలోని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ నివాసానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అయితే, అవన్నీ నకిలీ బెదిరింపులుగా అధికారులు తేల్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Ajith Kumar Aravind Swamy latest news MK Stalin security Tamil Nadu bomb threat Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.