Bomb: ఇటీవల తరచూ బాంబుల బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. ఢిల్లీలో గతనెలలో పలు స్కూల్లో బాంబులు పెట్టామని బెదిరింపులు రావడంతో పోలీసులు హుటాహుటిగా ఆయా స్కూళ్లను తనిఖీ చేశారు. చివరికి ఇదంతా ఉత్తిత్తే అని తేల్చేశారు. గతంలో విమానాల్లో కూడా బాంబుల కలకలం రేగింది. ఇటీవల ఇలాంటి బాంబుల బెదిరింపుల సంఖ్య పెరిగిపోతున్నాయి. వీటికి హద్దు ఉండడం లేదు. తాజాగా ఢిల్లీలోని హైకోర్టుకు(high Court) బాంబు బెదిరింపులు వచ్చాయి. మూడుచోట్ల పేలుడు పదార్థాలు పెట్టామంటూ.. మధ్యాహ్నం రెండు గంటలలోపు కోర్టును ఖాళీ చేయకపోతే పేల్చేస్తామంటూ మెయిల్లో హెచ్చరించారు. వెంటనే స్పందించిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. అయితే ఎంత వెతికినా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో ఇదంతా ఫేక్ గా తేల్చేశారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
బెదిరింపులతో భయానక వాతావరణం
ఈ శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టుకు ఒక ఈ-మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ లో మేం కోర్టు ప్రాంగణంలో మూడు బాంబులు అమర్చాం. మరికాసేపట్లో అవి పేలతాయి’ అని బెదిరించారు. అంతేకాకుండా మధ్యాహ్నం 2గంటలలోపు కోర్టును ఖాళీ చేయాలని అందులో స్పష్టంగా పేరొ న్నారు. అయితే ఏఏప్రాంతాల్లో పేలుడు పదార్థాలు పెట్టారనేది మెయిల్ లో పేర్కొనలేదు. ఈ బెదిరింపు మెయిల్ తో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అధికారులు
సంఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో పోలీసులు వచ్చారు. న్యాయమూర్తులు, సిబ్బంది అందరినీ బయటకు పంపించారు. పాంగణమంతా ఒక్కసారిగా ఖాళీ అయ్యింది. నిమిషాల వ్యవధిలోనే కోర్టు బయట భారీగా భద్రతాసిబ్బంది మోహరించారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినా ఎక్కడా పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో ఇది ఫేక్ అని పోలీసులు తేల్చేశారు. తనిఖీలో భాగంగా కోర్టు అమూల్యమైన సమయం వృధా అయ్యింది. ముఖ్యమైన విచారణలు, కేసుల వాదనలు వాయిదాపడ్డాయి. ఇప్పటికైనా తమకు న్యాయం(Justice) జరుగుతుందనే ఆశతో తమ కేసుల పరిష్కారం కోసం వచ్చిన వందలాదిమంది ప్రజలు ఊసురోమంటూ వెనుతిరిగివెళ్లారు.
కాల్ చేసిన వ్యక్తి పట్టుబడ్డాడా?
ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ చర్యలు తీసుకుంటున్నారు?
హైకోర్టు పరిసరాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also:
Telugu News: Karnataka-పరిహారం కోసం భర్తను హతమార్చి .. ఆపై పులిపైకి నెట్టేసిన భార్య!