📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Bollywood singer: గుండెపోటుతో ప్రముఖ గాయకుడు రిషబ్ టాండన్ మృతి

Author Icon By Saritha
Updated: October 22, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హఠాన్మరణం కలిచివేసిన రిషబ్ టాండన్ సంగీత రంగానికి తీరని లోటు

సినీ, సంగీత రంగానికి చెందిన ప్రముఖ గాయకుడు, నటుడు రిషబ్ టాండన్(Bollywood singer) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీలో(Delhi) తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. ఈ వార్తను ఆయన సన్నిహితులు ధృవీకరించగా, అభిమానులు, ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రిషబ్ టాండన్ ‘ఫకీర్’ అనే పేరుతో గుర్తింపు పొందారు. ముఖ్యంగా ‘ఇష్క్ ఫకీరానా’ పాటతో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. దీనివల్ల ఆయనకు ‘ఫకీర్ సింగర్’అనే బిరుదు కూడా వచ్చి పడింది. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా ఎన్నో ప్రాజెక్టుల్లో పనిచేశారు.

Read also: ఏపీ లో వాయుగుండం ముప్పు..అనిత కీలక హెచ్చరిక

ప్రొఫెషనల్ కెరీర్‌తో పాటు గాఢమైన వ్యక్తిగత జీవితం

రిషబ్ టాండన్(Bollywood singer) ముంబైలో తన భార్య ఓలేస్యాతో కలిసి నివసించేవారు. ఆయనకు పెంపుడు జంతువులంటే అపారమైన ప్రేమ ఉండేది. తన పెంపుడు జంతువులతో దిగిన ఫొటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉండేవారు.
అంతేగాక, ఆయన వారంరోజుల క్రితమే పుట్టినరోజు వేడుకలను భార్యతో కలిసి జరుపుకున్నారు. ఆ వేడుకల వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రిషబ్ చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా అదే వీడియో కావడం భావోద్వేగానికి లోనుచేస్తోంది.

ఈ క్రమంలో ఆయన రికార్డ్ చేసిన కొన్ని కొత్త పాటలు విడుదల కావాల్సి ఉండగా, ఈ హఠాన్మరణం అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Bollywood singer death Fakir singer passed away Ishq Fakirana singer Latest News in Telugu Rishabh Tandon death Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.