Board Exams: సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే పదో తరగతి పరీక్షలు ఒడిశాలో (Odisha) ముందుగానే ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాడు పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత, నిఘా నడుమ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 3,082 కేంద్రాల్లో 5.61 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
Read Also: Sundar Pichai on Vizag: ప్రపంచానికి గేట్ వేగా విశాఖపట్నం
మూడంచెల స్క్వాడ్ వ్యవస్థ
పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఒడిశా సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (BSE) పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందుకోసం మూడంచెల స్క్వాడ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలు, నోడల్ సెంటర్లపై 24 గంటల నిఘా ఉంచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కెమెరాలతో ప్రశ్నాపత్రాల సీల్ తెరవడం నుంచి పరీక్ష గదుల్లోని కార్యకలాపాల వరకు ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక తనిఖీ బృందాలు కూడా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శిస్తున్నాయి.
ప్రశాంతంగా ముగిసిన తొలిరోజు పరీక్ష
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది కేవలం విద్యాపరమైన మూల్యాంకనం మాత్రమే కాదని, విద్యార్థుల సహనం, పట్టుదల, ఆత్మవిశ్వాసానికి నిజమైన పరీక్ష అని సీఎం అన్నారు. మానసిక ఒత్తిడి లేకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యమిచ్చామని చెప్పిన మంత్రి గోండ్, భువనేశ్వర్‌లోని యూనిట్-1 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు.
గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలు మార్చి 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: