📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

BMC election results : నా ఇంటిని కూల్చారు, ఇప్పుడు ఫలితం ఇదేనా? కంగనా ఫైర్!

Author Icon By Sai Kiran
Updated: January 17, 2026 • 9:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

BMC election results : బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో దాదాపు 25 ఏళ్లుగా కొనసాగిన థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో శివసేన (యూబీటీ) అధికారాన్ని కోల్పోయింది. ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.

ఈ ఫలితాలపై నటి, బీజేపీ ఎంపీ Kangana Ranaut స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తన ఇంటిని కూల్చివేసిన వారికి ఇప్పుడు తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించారు. 2020లో అప్పటి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వ హయాంలో బీఎంసీ అధికారులు తన కార్యాలయంలోని కొంత భాగాన్ని కూల్చివేయడాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

మొత్తం 227 వార్డులున్న బీఎంసీలో (BMC election results) అధికారానికి 114 సీట్లు అవసరం కాగా, బీజేపీ–ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన కూటమి 118 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇందులో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, షిండే వర్గం 29 సీట్లు దక్కించుకుంది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 65 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 24, ఎంఎన్ఎస్ 6 స్థానాల్లో విజయం సాధించాయి.

ఈ విజయంపై ప్రధాని Narendra Modi హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కూటమి చేతికి రావడంతో త్వరలోనే ముంబైకి కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BJP Mahayuti victory BMC election results BMC politics news Breaking News in Telugu Google News in Telugu Kangana BMC controversy Kangana Ranaut Statement Latest News in Telugu Maharashtra local elections Mumbai municipal election news Shiv Sena UBT defeat Telugu News Thackeray family setback

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.