📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Black Market Trade: ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్

Author Icon By Saritha
Updated: December 26, 2025 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : తెలంగాణ(Telangana)మహారాష్ట్ర సరిహద్దులలో భోరజ్, సలాబాత్పూర్ వంటి చెకో పోస్టులతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో గతంలో ఉన్న తనిఖీ కేంద్రాల ఎత్తివేయడంతో తెలంగాణ (Black Market Trade) మహారాష్ట్ర మధ్య ఇదర్ కా మాల్ ఉదర్ – ఉదర్ కా మాల్ ఇదర్ వ్యాపారం చేసే నల్లబజారు నల్లతాచులకు కలిసొచ్చి నట్లయ్యింది. అడిగేవారు, ఆపేవారు లేకపోవడంతో చాలా సులభంగా తెలంగాణ పౌరసరఫరాశాఖ సన్నబియ్యం మహారాష్ట్రాకు, మహారాష్ట్రా వంటగ్యాస్ తెలంగాణ సరిహద్దు దాటిస్తున్నారు. తెలంగాణ సన్నబియ్యం కోసం నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మండల్తో పాటు ఆదిలాబాద్ జిల్లాను అనుకొని ఉన్న పలు గ్రామాలు పట్టణాలలో ప్రత్యేక దుకాణాలు సరిహద్దు పొడుగూత తెరిచి ఉంచి నిర్భయంగా సివిల్సప్లయ్ బియ్యం కొనుగోలు చేస్తుంటారు. అదే తరహాలో వంటగ్యాస్ అటు నుంచి ఇటు వస్తోంది. LPG గ్యాస్ ధరలు తెలంగాణతో పోలిస్తే మహారాష్ట్రలో తక్కువగా ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు గుట్టుగా గ్యాస్ సిలిండర్లను మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తరలిస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో నెలకు సుమారు ఇరువై లక్షలకు పైగా వ్యాపారం సాగుతోందని తెలిసింది.

Read Also: Kerala Train Incident:రీల్స్ మోజుతో రైలు నిలిపివేత..ఇద్దరు విద్యార్థుల అరెస్ట్

Goods from here go there, and goods from there come here.

ధరల తేడాతో లాభపడుతున్న నల్లబజారు దళారులు

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమురంభీంజిల్లాలకు చెందిన కొందరు దళార్లు పొరుగు రాష్ట్రంలోని గడ్చిరోలి, చంద్రాపూర్, యావత్మాల్, లాతూరు, నాందేడ్, ధర్మాబాద్ కిన్వట్ ప్రాంతాల గ్యాస్ డీలర్ల సహకారంతో ఈ తంతు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. (Black Market Trade) తెలంగాణకు చెందిన హెచ్పీ, ఇండేన్, భారత్ పెట్రోలియం కంపెనీల ఖాళీ సిలిండర్లను అక్కడకు తీసుకెళ్లి వారివద్ద సిలిండర్లు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ధరతో పోలిస్తే అక్కడ గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.51 వరకు తక్కువ కాగా, వాణిజ్య సిలిండర్ ధర రూ.170 వరకు తక్కువకు దొరుకుతోంది. అక్కడ పెద్దమొత్తంలో సిలిండర్లను కొనుగోలు చేస్తూ స్థానిక మార్కెట్ ధరతో విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో ఐదు కిలోల సిలెందరు రూ.328 కి పౌరసరఫరాలశాఖ వినియోగదారుడికి ఇస్తుంటే మన వద్ద దాని ధర రూ.347 ఏంది అదే విధంగా సాధారణంగా గృహాలలో 14.2కిలోల వంటగ్యాస్ సిలెండర్ వినియోగిస్తుంటారు. తెలంగాణాలో దాని ధర రూ.930 ఉంటే మహారాష్ట్రలో 878.51 ఉంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19కిలోల గ్యాస్ ధర పొరుగు రాష్ట్రంలో 1672 రూపాయలు ఉంటే తెలంగాణాలో 1843.5 రూపాయలు ఉంది. అదే విధంగా 47.5కిలోల గ్యాస్ సిలెండర్ ధర 4148 రూపాయలు ఉంటే తెంగాణాలో 4604 రూపాయలు ధర ఉంది.

గ్యాస్ సిలిండర్ల అక్రమ తరలింపుపై అధికారుల నిర్లక్ష్యం

తెలంగాణతో సరిహద్దు కలిగిన బేల, తాంస్, తలమడుగు, జైనథ్, కెరమెరి సిర్పూర్ (టీ) కొట్టాల, లింగారెడ్డి మండల్ మద్దనూరు, తానూరు, కుభీరు, కుంటాల, సారంగాపూర్ తదితర మండలాలను కేంద్రంగా చేసుకొని హోటళ్ళు, ఎల్పిజీ గ్యాస్ నడిచే వాహనాలకు మహారాష్ట్ర గ్యాస్ ఉపయోగించుకోవడానికి చక్కటి అవకాశం ఏర్పడింది. ఎల్పీజీ ఫిల్లింగ్ కేంద్రాలతో పోలిస్తే నేరుగా సిలిండర్ నుంచి గ్యాస్ నింపుకోవడం ఖర్చు తక్కువవుతుంది. వేబిల్లులు, పన్నులు చెల్లింపులు వంటి సాంకేతిక అంశాలు క్షేత్రస్థాయి అధికారులు అంతగా పరిశీలించకపోవడంతో గ్యాస్ రాచమార్గంగా డొంక దారుల్లో బండ్ల బాటల్లో కూడా ఎందుకొని సిలిండర్లను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమురంభీం జిల్లాలో లక్షల రూపాయలకు పైగా వ్యాపారంప్రధానంగా 14.2 కిలోలు, 19 కిలోల సిలిండర్లను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజామాబాద్ జిల్లాలోనే సగటున రోజుకు 100 వరకు గృహావసర సిలిండర్లు, 50 వరకు వాణిజ్య సిలిండర్లు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన రోజుకు రూ.15వేలలోపు, నెలకు రూ. నాలుగు లక్షలు చొప్పున వారికి గిట్టుబాటవుతోంది. ఇందులో రవాణా, ఇతరత్రా ఖర్చులు పోయినా రూ.3 లక్షలకు పైగానే వెనకేసుకుంటున్నట్లు ఈ వ్యాపారంపై చర్చించుకొంటున్నారు. మరోవైపు మన సన్నబియ్యం పిడిఎస్ వాహానాలకు జిపిఎస్ తొలగించి వాటిని మోటార్ బైకులకు బిగించి సివిల్ సప్లయ్ అధికారులను తప్పుదారి పట్టిస్తూ ఎం.ఎల్ఎస్ పాయింట్ల నుంచి నేరుగా మిల్లులకు వీలైతే బార్డర్లో వీటి కోసం ప్రత్యేకంగా తెరిచిన దుకాణాలకు తరలిస్తు ఇక్కడ చవకబియ్యం అక్కడికి అక్కడి చవక గ్యాస్ ఇక్కడికి వస్తుమార్పిడి మన నల్లబజారు త్రాచులు. చేసుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Black Market Trade Border Districts Civil Supplies Latest News in Telugu LPG Gas Smuggling PDS Rice Smuggling Telangana–Maharashtra Border Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.