📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Delhi’s New Mayor : ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

Author Icon By Sudheer
Updated: April 25, 2025 • 7:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రాజా ఇక్బాల్ సింగ్ ఘన విజయాన్ని సాధించారు. శుక్రవారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఆయన 133 ఓట్లతో గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి మన్‌దీప్ కేవలం 8 ఓట్లకే పరిమితమయ్యారు. మొత్తం 142 ఓట్లలో ఒక ఓటు చెల్లనిదిగా ప్రకటించబడింది. ఈ విజయంతో గత రెండు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ఎంసీడీపై బీజేపీ ఆధిపత్యం సాధించగలిగింది.

ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ దూరం

అయితే ఈ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కరించింది. బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఆ పార్టీ ఆరోపించింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మహేశ్ కుమార్ 3 ఓట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎంసీడీలో 250 సీట్లలో బీజేపీకి 117, ఆమ్ ఆద్మీ పార్టీకి 113 సీట్లు ఉన్నాయి. ఇతర కొన్ని సీట్లు ఖాళీగా ఉండటంతో ఈ ఎన్నికలో ఓట్ల మార్పిడి చర్చకు దారి తీసింది.

ఢిల్లీ ప్రజల కష్టాలు తొలగిస్తా – రాజా ఇక్బాల్ సింగ్

మేయర్‌గా ఎన్నికైన అనంతరం రాజా ఇక్బాల్ సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలకు శుభ్రమైన వాతావరణం, నీటి ముంపు సమస్యల పరిష్కారం, చెత్త గుట్టల తొలగింపు, మౌలిక వసతుల కల్పన తమ ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తామని, నగరాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.

bjp win delhi mayor elections delhi new mayor Google News in Telugu Raja Iqbal Singh is Delhi's new mayor

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.