📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rajya Sabha Candidates List: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ప్రకటన

Author Icon By Anusha
Updated: March 4, 2026 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rajya Sabha Candidates List: భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్‌ను కూడా నిలబెట్టింది. బీహార్ నుండి రాజ్యసభకు నితిన్ నబిన్, శివేష్ రామ్‌లను నామినేట్ చేసింది. నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 5 చివరి తేదీ. మార్చి 15న ఓటింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తారు.

Read Also: Dam height issue : ఆలమట్టి డ్యాం ఎత్తు వివాదం, కేంద్ర జోక్యం కోరిన డీకే
రాష్ట్రాల వారీగా బీజేపీ అభ్యర్థుల వివరాలు

పార్టీ విధేయులకు, సీనియర్ నేతలకు, వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ బీజేపీ ఈ ఎంపిక చేసింది. రాష్ట్రాల వారీగా నామినేట్ అయిన అభ్యర్థులు వీరే:

రాష్ట్రంఅభ్యర్థుల పేర్లు
బీహార్నితిన్ నబీన్, శివేష్ కుమార్
ఒడిశామన్మోహన్ సామల్ (రాష్ట్ర అధ్యక్షుడు), సుజిత్ కుమార్ (సిట్టింగ్ ఎంపీ)
అస్సాంజోగన్ మోహన్ (రాష్ట్ర మంత్రి), తేరాష్ గోవాలా (ఎమ్మెల్యే)
ఛత్తీస్‌గఢ్లక్ష్మి వర్మ (రాష్ట్ర ఉపాధ్యక్షురాలు)
హర్యానాసంజయ్ భాటియా (మాజీ ఎంపీ)
పశ్చిమ బెంగాల్రాహుల్ సిన్హా (మాజీ రాష్ట్ర అధ్యక్షుడు)


ఎన్నికల షెడ్యూల్ ఇదే!

ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ బలం 133 కాగా, అందులో బీజేపీకి 103 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తంగా మార్చి 16వ తేదీన 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో 6 చొప్పున స్థానాలు, బిహార్‌లో 4, ఒడిశా, అస్సాంలో 3 చొప్పున, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో రెండు చొప్పున స్థానాలు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న స్థానాల్లో తమ పట్టు నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. పార్టీ విధేయత, సామాజిక సమతుల్యత పాటిస్తూ ఈ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Jogen Mohan Assam BJP Manmohan Samal Odisha Rajya Sabha Nitin Nabin Rajya Sabha Bihar Rahul Sinha West Bengal BJP Rajya Sabha Candidates List Sanjay Bhatia Haryana Rajya Sabha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.