దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు పట్టణాలు, నగరాలు, గ్రామాల పేర్లను మార్చే ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. వలస పాలకుల కాలం నుంచి కొనసాగుతున్న పేర్లను తొలగించి, భారతీయ సంస్కృతి, చరిత్రకు అనుగుణంగా కొత్త పేర్లు ఇవ్వాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పలు నగరాల పేర్లు మార్చబడ్డాయి. ఇప్పుడు అదే తరహాలో దేశ రాజధాని ఢిల్లీ (Delhi) పేరు మార్పుపై చర్చ మళ్లీ ప్రారంభమైంది.
Read Also: GST: లక్షల కోట్ల ఆదాయం పొందిన జీఎస్టీ వసూళ్లు
ఈ మేరకు ఢిల్లీ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేవాల్ (BJP MP Praveen Khandewal).. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) కు ఒక లేఖ రాశారు. ఢిల్లీ నగరానికి ఉన్న ఘనమైన ప్రాచీన వారసత్వం, సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని.. ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని ఆయన కోరారు.ఎంపీ ప్రవీణ్ ఖండేవాల్ తన లేఖలో ఢిల్లీ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తు చేశారు.
ఢిల్లీ (Delhi) చరిత్ర పాండవుల యుగానికి నేరుగా అనుసంధానమై ఉందని.. మహాభారత కాలంలో పాండవులు యమునా నది ఒడ్డున తమ రాజధానిగా ఇంద్రప్రస్థను స్థాపించారని పేర్కొన్నారు. ఇది శ్రేయస్సు, సుపరిపాలన, నీతికి చిహ్నమని.. అందుకే ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చడం వల్ల మన అద్భుతమైన సంప్రదాయాలను పునరుద్ధరించడమే అవుతుందని వెల్లడించారు.
ప్రముఖ ప్రాంతాల్లో పాండవుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని
కేవలం ఢిల్లీ పేరును మాత్రమే మార్చడం కాకుండా.. ఢిల్లీలోని ఇతర ముఖ్యమైన ప్రాంతాల పేర్లను కూడా మార్చాలని ప్రవీణ్ ఖండేవాల్ సూచించారు. ఢిల్లీని ఇంద్రప్రస్థ గా మార్చడంతోపాటు.. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ (Delhi Railway Station) పేరును ఇంద్రప్రస్థ జంక్షన్‌గా మార్చాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మార్చాలని వెల్లడించారు.
ఇక ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతాల్లో పాండవుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.ఈ పేరు మార్పు ప్రతిపాదన ఢిల్లీ నగరానికి చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరిస్తుందని ప్రవీణ్ ఖండేవాల్ పేర్కొన్నారు. ఇంద్రప్రస్థ అనే పేరు పెట్టడం వల్ల మన మూలాలను తిరిగి కలుపుతుందని.. సాంస్కృతిక పునరుద్ధరణలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని వాదించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: