📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

BJP MLAs Clash : అసెంబ్లీలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ

Author Icon By Sudha
Updated: August 15, 2025 • 3:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీలో ఘర్షణ జరిగింది. (BJP MLAs Clash) ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను కొట్టేందుకు (to beat)తన సీటు నుంచి పైకి లేచి ముందుకు వచ్చారు. అయితే మిగతా సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేను నిలువరించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం ‘విజన్ 2047’ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార పార్టీ తరపున ఎవరు మాట్లాడాలో నిర్ణయించే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాదన(BJP MLAs Clash) ప్రారంభమైంది.

BJP MLAs Clash : అసెంబ్లీలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ

కాగా, వారణాసి బీజేపీ ఎమ్మెల్యే సౌరభ్ శ్రీవాస్తవతో మథుర బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ చౌదరి తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆయన తన పేరును స్పీకర్‌కు ఫార్వార్డ్ చేయడం లేదని రాజేష్‌ చౌదరి ఆరోపించారు. ముందు సీటులో కూర్చొన్న సౌరభ్ శ్రీవాస్తవపై దాడి చేసేందుకు తన సీటు నుంచి పైకి లేచారు. అయితే మిగతా సభ్యులు రాజేష్ చౌదరిని సముదాయించారు. ఆయన దాడి చేయకుండా నిలువరించారు. మరోవైపు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్ యాదవ్ ఈ సంఘటనపై స్పందించారు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAs Clash) అసెంబ్లీలో ఘర్షణ పడిన వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్‌ చేశారు. ‘అసభ్యకరమైన ప్రవర్తన’ ‘అసభ్యకరమైన భాషను’ ఉపయోగించే నాయకులను బీజేపీ ప్రోత్సహిస్తున్నది’ అని విమర్శించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

40 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రం ఏది?

మిజోరాం మరియు గోవాలలో ఒక్కొక్కటి 40 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సిక్కింలో 32 మంది ఉన్నారు. శాసనసభలోని అందరు సభ్యులు వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నుకోబడతారు మరియు ఒక సభ్యుడు ఒక నియోజకవర్గం నుండి ఎన్నికవుతారు.

ఎమ్మెల్యే అనర్హత వేళ ఏమవుతుంది?

పార్లమెంటు సభ్యుడు (MP), శాసనసభ సభ్యుడు (MLA) లేదా శాసన మండలి సభ్యుడు (MLC) ఎవరైనా నేరానికి పాల్పడి కనీసం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడితే, తక్షణమే సభ సభ్యత్వాన్ని కోల్పోతారని యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ఇచ్చింది.

ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావచ్చా?

రాష్ట్ర శాసన మండలి (MLC) సభ్యులు భారత పౌరులై ఉండాలి, కనీసం 30 సంవత్సరాలు నిండి ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, దివాలా తీసిన వ్యక్తి కాకూడదు మరియు రాష్ట్రానికి చెందిన నమోదిత ఓటరు అయి ఉండాలి. ఒక సభ్యుడు ఒకేసారి పార్లమెంటు సభ్యుడు మరియు రాష్ట్ర శాసనసభ సభ్యుడు కాకపోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/rahuls-tour-in-bihar-from-17th-of-this-month/national/530375/

Assembly Clash BJP Internal Conflict BJP MLAs Breaking News latest news Political Fight Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.