📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు

Author Icon By Sukanya
Updated: January 25, 2025 • 7:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చివరి మేనిఫెస్టోని శనివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా విడుదల చేసారు. బీజేపీ అధికారంలోకి వస్తే గిగ్ వర్కర్లకు 10 లక్షల రూపాయలు జీవిత బీమా, 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, గుజరాత్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ తరహాలో యమునా నదీ తీరాన్ని అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోను విడుదల చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విలేకరులతో అమిత్ షా మాట్లాడుతూ, 50,000 ఉద్యోగాలు, ఢిల్లీ ప్రజలకు 20 లక్షల స్వయం ఉపాధి అవకాశాలు, ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాల భాగస్వామ్యంతో మహాభారత్ కారిడార్ కల్పనకు బిజెపి హామీ ఇస్తుందని చెప్పారు.

ఢిల్లీలోని 1,700 అనధికార కాలనీల్లో కొనుగోలు, అమ్మకం, నిర్మాణంతో సహా పూర్తి యాజమాన్య హక్కులను బీజేపీ ఇస్తుందని ఆయన చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద సీనియర్ సిటిజన్లకు బీజేపీ ఉచిత చికిత్స అందజేస్తుందని, అధికారంలోకి వోచిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలో ఈ పధకానికి ఆమోదం తెలుపుతామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఆప్ హయాంలో సీల్ చేసిన 13,000 షాపులను తెరిచేందుకు కూడా కృషి చేస్తామని, 13,000 బస్సులను ఈ-బస్సులుగా మారుస్తామని ఆయన చెప్పారు.

మూడేళ్ళలో యమునా నదిని శుద్ధి చేసి అరవింద్ కేజ్రీవాల్ మరియు అతని కుటుంబాన్ని స్నానానికి ఆహ్వానిస్తాను అని ఆయన అన్నారు. ఢిల్లీలో పేదల సంక్షేమ పథకాలు ఏవీ నిలిపివేయబడవని, బీజేపీ హామీలను నెరవేరుస్తుందని నేను పునరుద్ఘాటిస్తున్నానని అమిత్ షా అన్నారు. జనవరి 17న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా విడుదల చేసిన మేనిఫెస్టో మొదటి భాగంలో మహిళా సమృద్ధి యోజన కింద రూ.2,500 , గర్భిణులకు రూ.21,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ హామీ ఇచ్చింది . అధికారంలోకి వస్తే ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ, హోలీ, దీపావళి సందర్భంగా మహిళలకు ఒక్కో సిలిండర్‌ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కెజి మరియు పిజి విద్యార్థులకు ఉచిత విద్యను అందజేస్తుందని, అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Amit Shah Ayushman Bharat scheme BJP Delhi Elections Delhi polls Google news Yamuna riverfront

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.