📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

BJP leader: నితిన్ నబిన్ ఆస్తుల వివరాలు

Author Icon By Saritha
Updated: January 21, 2026 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ మాజీ మంత్రి నితిన్ నబిన్ (BJP leader) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మంగళవారం ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పాట్నా బంకిపూర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నబిన్ 2006 నుండి బీహార్ రాజకీయాల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించారు. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు, అప్పులు, పెట్టుబడుల వివరాలను పారదర్శకంగా వెల్లడించారు.

Read Also: High Way: టోల్‌ ఫీ పెండింగ్ ఉంటే వాహన సేవలకు బ్రేక్.. కేంద్రం షాక్

ఆస్తుల పారదర్శకత, రాజకీయ అనుభవం

అఫిడవిట్ ప్రకారం 12వ తరగతి వరకు మాత్రమే చదివిన నితిన్ నబిన్ (Nitin Nabin) నికర విలువ రూ. 3.06 కోట్లు. (BJP leader) ఆయనపై ఉన్న మొత్తం అప్పులు సుమారు రూ. 56 లక్షలు. నితిన్ నబిన్, ఆయన కుటుంబ సభ్యుల వద్ద ఉన్న నగదు నిల్వలు కలిపి సుమారు రూ. 60 వేలు మాత్రమే ఉన్నాయి. ఆయన, ఆయన భార్యకు చెందిన వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో రూ. 98 లక్షలకుపైగా డిపాజిట్లుఉన్నట్లు వెల్లడైంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నితిన్ నబిన్ స్వయంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉన్నారు. అయితే, ఆయన భార్య మిడ్-క్యాప్, మల్టీ-క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో రూ. 6 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

BJP leader Nitin Nabin’s asset details

బీమా విషయంలో నితిన్ నబిన్ వద్ద మూడు LIC పాలసీలు, ఒక HDFC లైఫ్ పాలసీ ఉండగా, ఆయన భార్యకు LIC, SBI లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. నితిన్ నబిన్ పేరుపై స్కార్పియో, ఇన్నోవా క్రిస్టా కార్లు ఉండగా, కుటుంబం వద్ద రూ.11 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆయన చరాస్తులు రూ.92.71 లక్షలు, భార్య పిల్లల చరాస్తులు రూ.68 లక్షలకు పైగా. నితిన్ నబిన్‌కు స్వంత స్థిరాస్తులు లేకపోయినా, భార్య పేరిట రూ.28 లక్షల వ్యవసాయ భూమి, పాట్నాలో రూ.1.18 కోట్ల విలువైన ఇల్లు ఉంది. ఆస్తుల పారదర్శకత, రాజకీయ అనుభవంతో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీ వ్యూహాల్లో కొత్త మార్పులు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:


Assets and Liabilities Bihar Politics BJP election affidavit Latest News in Telugu National President Nitin Nabin Patna Bankipur political leadership Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.