📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Congress : ఆపరేషన్​ సిందూర్​ను బీజేపీ రాజకీయం చేస్తోంది : కాంగ్రెస్‌ పార్టీ

Author Icon By Sudha
Updated: May 15, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్‌ సిందూర్‌ను బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. భారత్‌- పాక్‌ కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించింది. దీనిపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ర్యాలీలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బుధవారం సాయంత్రం దిల్లీలోని అక్బర్‌ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్, ప్రియాంకా గాంధీ వాద్రా, సచిన్‌ పైలట్‌తో పాటు పలువురు నేతలు సమావేశమయ్యారు. అనంతరం పార్టీ సీనియర్‌ నేత పవన్‌ ఖేడాతో కలిసి జైరాం రమేశ్‌ మీడియాతో మాట్లాడారు.

Congress : ఆపరేషన్​ సిందూర్​ను బీజేపీ రాజకీయం చేస్తోంది : కాంగ్రెస్‌ పార్టీ

జైహింద్ పేరిట ర్యాలీలు
రానున్న రోజుల్లో ప్రభుత్వం నంచి సమాధానాలు కోరుతూ వివిధ రాష్ట్రాల్లో జైహింద్ పేరిట ఈ ర్యాలీలు జరుగుతాయని జైరాం రమేశ్ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై రాజకీయాలు చేయడం తగదన్నారు. సైనిక చర్య సాయుధ దళాలు, దేశానికి చెందినది అయినప్పటికీ, బీజేపీ దీన్ని తమ బ్రాండ్‌గా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ను స్వాగతించమని అన్నారు. పాక్‌పై చర్యలకు మద్దతు ఇచ్చారమని తెలిపారు. మేం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తే, రెండు సార్లు భేటీలు జరిగితే ప్రధాని మాత్రం హాజరు కాలేదని అన్నారు. కేవలం లాంఛనప్రాయంగానే ముగిశాయని పేర్కొన్నారు.
ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి పహల్గాం ఉగ్రదాడి గురించి చర్చించాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ లేఖ రాశారని జైరాం రమేశ్ అన్నారు. ఈ నెల 25న ఎన్​డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ కానున్నట్లు సమాచారం ఉందని, ఆ సమావేశానికి విపక్ష రాష్ట్రాల సీఎంలను ఎందుకు ఆహ్వానించలేదని అడిగారు. వారు చేసిన తప్పేంటి అని అన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీరుపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరపాలని డిమాండ్ చేశారు. అని జైరాం రమేశ్ డిమాండ్‌ చేశారు.

Read Also : Colonel Sofiya Qureshi: కల్నల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు – మంత్రిపై ఎఫ్‌ఐఆర్, క్షమాపణలు

BJP is Breaking News in Telugu congress party Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News politicizing Operation Sindoor: Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.