గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం(BJP Government) తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసింది. పాఠశాలల ప్రాంగణాల్లో, పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న వీధి కుక్కల వివరాలను సేకరించి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఈ నెల 11న సర్క్యులర్ జారీ చేసి, మూడు రోజుల్లోనే సర్వే పూర్తిచేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు సూచనలను కారణంగా చూపుతూ దీనిని అత్యవసర చర్యగా ప్రభుత్వం పేర్కొంది.
Read Also: BJP: రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించాలని దూబే డిమాండ్
ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం.. కాంగ్రెస్ విమర్శలు
ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బోధనతో పాటు ఎన్నికల విధులు, సర్వేలు, ప్రభుత్వ (BJP Government)కార్యక్రమాల పనులతో తాము ఒత్తిడిలో ఉన్నామని వారు వాపోతున్నారు. మరుగుదొడ్ల లెక్కింపు నుంచి జనసమీకరణ వరకు అనేక విద్యేతర పనులు అప్పగించడం వల్ల అసలు బోధనకు సమయం దొరకడం లేదని విమర్శిస్తున్నారు. వీధి కుక్కల గణన కూడా తమకే అప్పగించడం ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని తగ్గించే చర్యగా వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ దోషి మాట్లాడుతూ, ఉపాధ్యాయులను డేటా సేకరణ యంత్రాలుగా మార్చడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ సర్వే ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యా ప్రమాణాలు దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: