📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

ఢిల్లీ మహిళలకు బీజేపీ ప్రభుత్వం శుభవార్త

Author Icon By Divya Vani M
Updated: March 8, 2025 • 7:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ మహిళలకు బీజేపీ ప్రభుత్వం శుభవార్త అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సహాయం అందించే మహిళా సమృద్ధి యోజన పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఈ పథకాన్ని అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హామీని నిజం చేయడానికి మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపిందని సీఎం వెల్లడించారు. ఢిల్లీలో పేద మహిళలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపిందని రేఖా గుప్తా తెలిపారు. ఈ పథకం కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీకి ఆశిష్ సూద్, పర్వేశ్ శర్మ, కపిల్ మిశ్రా వంటి సీనియర్ మంత్రులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ఢిల్లీ మహిళలకు బీజేపీ ప్రభుత్వం శుభవార్త

ప్రత్యేక పోర్టల్ ద్వారా నమోదు

పథకానికి అర్హులైన మహిళలు తమ పేరు నమోదు చేసుకోవడానికి ప్రత్యేక వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే పూర్తిచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం ద్వారా పేద, మధ్య తరగతి మహిళలకు లబ్ధి కలుగుతుందని సీఎం తెలిపారు. ప్రభుత్వానికి ఇది భారీ ఆర్థిక భారం అయినా, మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు

రాష్ట్రంలోని పేద మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇది కేవలం ఎన్నికల హామీ నెరవేర్పుగా కాకుండా, మహిళా సాధికారిత కోసం కీలక అడుగు అని వ్యాఖ్యానించారు.

2500RupeesScheme BJPPromises DelhiCMRekhaGupta DelhiGovernmentSchemes FinancialAidForWomen MahilaSamruddhiYojana WomenEmpowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.