📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Sonia Gandhi: సోనియాగాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు

Author Icon By Vanipushpa
Updated: August 13, 2025 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం ఓట్ల చోరీ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. బీజేపీ(BJP), ఎన్నికల సంఘం(EC) కలిసి.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారీ అక్రమాలకు పాల్పడ్డాయని ఇటీవల విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్‌లో మహదేవపుర నియోజకవర్గంలో బీజేపీ లక్షకు పైగా ఓట్లు చోరీ చేసినట్లు రాహుల్ విమర్శించారు. బీజేపీ ఇలాంటి మోసాలకు పాల్పడి ఎన్నికల్లో గెలుస్తోందని ధ్వజమెత్తారు. అయితే రాహుల్‌ గాంధీ ఆరోపణలను బీజేపీ ఖండిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో మోసాలకు పాల్పడినట్లు బీజేపీ నేత అమిత్‌ మాలవీయ అన్నారు.
భారత పౌరసత్వం రాకముందే ఓట్లర్ల లిస్టులో సోనియా గాంధీ పేరు
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ(Sonia Gandhi) కి గతంలో భారత పౌరసత్వం రాకముందే ఓట్లర్ల లిస్టులో ఆమె పేరు ఉందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హయాంలో పౌరసత్వం లేనివారికి ఇలా ఓటు హక్కు ఎలా కల్పించారంటూ ప్రశ్నించారు. ”సోనియా గాంధీకి భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే ఓటర్ల లిస్టులో ఆమె పేరుంది. అప్పటికీ ఆమెకు ఇటాలియన్ పౌరసత్వమే ఉంది. ఆ సమయంలో ఓటర్ల లిస్టులో రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, సంజయ్‌ గాంధీ, మేనకా గాంధీలతో సహా ఆమె పేరును కూడా చేర్చారు.

Sonia Gandhi: సోనియాగాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు

సోనియాగాంధీకి భారత పౌరసత్వం మంజూరు
దీనికి వ్యతిరేకంగా 1982లో నిరసనలు కూడా జరిగాయి. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె పేరును తొలగించింది. ఆ తర్వాత 1983 జనవరిలో మళ్లీ ఆమె పేరు చేర్చారు. అదే ఏడాది ఏప్రిల్ 30న సోనియాగాంధీకి భారత పౌరసత్వం మంజూరు చేశారు. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మోసాలకు పాల్పడింది. దీనిపై కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని” అమిత్‌ మాలవీయ డిమాండ్ చేశారు.
65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగింపు
ఇదిలాఉండగా బిహార్‌లో ఇటీవల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను కూడా విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు విమర్శలు చేస్తున్నాయి. మంగళవారం పార్లమెంట్ బయట మింతా దేవి అనే మహిళా ఓటరు ఫొటోతో టీ షర్టులు ధరించి నిరసనలు కూడా చేశారు. అయితే కాంగ్రెస్‌ నేతల ఆందోళన వల్ల మీడియా వాళ్లు తమ ఇంటికి వచ్చి ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నారని మింతా దేవి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మా పర్మిషన్ లేకుండా ఫొటోలు ఎలా ముద్రిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. గృహిణికి సంబంధించిన వివరాలు, ఫొటోలను ఎలాంటి పర్మిషన్ లేకుండానే కాంగ్రెస్ నేతలు బయటకు ఎలా విడుదల చేస్తారంటూ మండిపడ్డారు. దీనికి క్షమాపణలు చెబుతారా అంటూ ప్రశ్నించారు.
బీజేపీ, ఈసీపై నెటిజన్లు విమర్శలు
మరోవైపు ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి చెందిన 300 మందికి పైగా ఎంపీలు పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ఇతర కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఓట్ల చోరీ వ్యవహారంపై చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల్లో నిజంగానే అక్రమాలు జరుగుతున్నాయని పలువురు నెటిజన్లు బీజేపీ, ఈసీపై విమర్శలు చేస్తున్నారు. ఈసీ పారదర్శకంగా వ్యవహరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇటలీలో సోనియా గాంధీ పేరు ఏమిటి?

1998లో, ఆమె భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సోనియా ఇటలీలోని ఓవాసాంజోలో ఆంటోయియో మైనోగా జన్మించారు.

సోనియా గాంధీ గత వృత్తి ఏమిటి?

మరుసటి సంవత్సరం, ఆమె రాజీవ్ గాంధీని వర్సిటీ రెస్టారెంట్‌లో కలిసింది, అక్కడ ఆమె పార్ట్‌టైమ్ వెయిట్రెస్‌గా పనిచేస్తోంది, అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చేరాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/prisoners-released-due-to-overcrowding-in-jails/international/529873/

BJP allegations congress party Indian Politics Latest News Breaking News Political Controversy sonia gandhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.