Bird Flu: చెన్నైలో బర్డ్ ఫ్లూ తో 1,500 కాకులు మృతి

Read Time:  1 min
Bird Flu: చెన్నైలో బర్డ్ ఫ్లూ తో 1,500 కాకులు మృతి
FONT SIZE
GET APP

చెన్నై నగరంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామం ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. ఒక్కసారిగా 1,500కు పైగా కాకులు మృతి చెందడం,బర్డ్ ఫ్లూ (Bird Flu) (ఏవియన్ ఇన్ ఫ్లుయెంజా) కారణంగానే అని నిర్ధారణ కావడంతో నగరాన్ని హై అలర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి, వ్యాధి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవలి రోజుల్లో నగరంలోని అడయార్, గాంధీ నగర్, పల్లికరనై, వేలచ్చేరి, ఈస్ట్ కోస్ట్ రోడ్, ఓల్డ్ మహాబలిపురం రోడ్ వంటి పలు ప్రాంతాల్లో కాకులు పెద్ద సంఖ్యలో చనిపోయి కనిపించాయి.

Read Also: Anthropic AI: చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

Bird Flu: చెన్నైలో బర్డ్ ఫ్లూ తో 1,500 కాకులు మృతి
1,500 crows have died due to bird flu in Chennai.

కాకుల మృతికి బర్డ్ ఫ్లూనే కారణం

(Bird Flu) సమాచారం అందుకున్న కాంచీపురం యానిమల్ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ బృందం గత నెలలో మరణించిన కాకుల నుంచి శాంపిళ్లను సేకరించి భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ డిసీజ్ కంట్రోల్‌కు పంపింది. పరీక్షల అనంతరం కాకుల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని నివేదికలు స్పష్టం చేశాయి.ఈ వైరస్ ఇతర జంతువులకు, అరుదుగా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉండటంతో కేంద్ర పశువైద్య పరిశోధన సంస్థ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.

నిఘాను పెంచాలని, ప్రభావిత ప్రాంతాల్లో పక్షుల కదలికలపై ఆంక్షలు విధించాలని సూచించింది. పశుసంవర్ధక శాఖ కూడా ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. ఎక్కడైనా పక్షులు చనిపోయి కనిపిస్తే వెంటనే అధికారులకు తెలపాలని కోరింది. చనిపోయిన పక్షులను నేరుగా చేతులతో తాకవద్దని, వాటి కళేబరాలను కనీసం 8 అడుగుల లోతైన గొయ్యి తీసి పూడ్చివేయాలని హెచ్చరించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.