📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Bijapur encounter : బీజాపూర్ ఎన్‌కౌంటర్ షాక్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మృతి!

Author Icon By Sai Kiran
Updated: January 17, 2026 • 10:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bijapur encounter : మావోయిస్టు పార్టీకీ మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు అలియాస్ మోంగు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు కీలక వ్యూహకర్తగా ఉన్న పాపారావుపై కోటి రూపాయల వరకు రివార్డు ఉంది. మాడ్వి హిడ్మా సహా పలువురు సీనియర్ నేతలు మృతి చెందిన తర్వాత దక్షిణ బస్తర్‌లో మిగిలిన టాప్ మావోయిస్టు నేతల్లో పాపారావు ఒకడిగా కొనసాగుతున్నాడు.

Read Also: Health Department:త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పాపారావు కదలికలపై నిఘా సమాచారం అందడంతో (Bijapur encounter) ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. తెల్లవారుజామున జరిగిన భీకర కాల్పుల్లో పాపారావుతో పాటు మరో మావోయిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎన్‌కౌంటర్ స్థలంలో రెండు ఏకే రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

గతేడాది నవంబర్‌లో ఇదే ఇంద్రావతి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాపారావు తృటిలో తప్పించుకున్నాడు. అప్పట్లో అతని భార్య ఊర్మిళ సహా పలువురు నేతలు మృతి చెందారు. అయితే అప్పట్లో తప్పించుకున్న పాపారావు, ఇప్పుడు అదే అడవుల్లో భద్రతా దళాల చేతిలో హతమవడం గమనార్హంగా మారింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bastar Maoist operation Bijapur encounter Bijapur naxal encounter Breaking News in Telugu Chhattisgarh Naxal news DRG STF CoBRA operation Google News in Telugu Indravati National Park encounter Latest News in Telugu Maoist encounter Chhattisgarh Maoist Leader Killed most wanted maoist Paparao Maoist killed Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.