📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Bihar Elections 2025: బిహార్‌ మొదటి దశ పోలింగ్.. ఓటేసిన నితీష్

Author Icon By Anusha
Updated: November 6, 2025 • 2:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Bihar Elections 2025

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections 2025) ప్రశాంతంగా జరుగుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. మొత్తం 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో ఇవాళ ఓటింగ్‌ జరుగుతోంది. సుమారు 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కమిషన్‌ సమాచారం ప్రకారం ఉదయం 11 గంటల వరకు 27 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ దశలో 45,341 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

Read Also: Coimbatore Crime: దూమారం రేపుతున్న డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections 2025) మొదటి దశలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ఓటు వేశారు. భక్తియార్‌పూర్‌లోని మంజు సిన్హా ప్రాజెక్ట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి (Deputy CM Samrat Chaudhary) ఓటు వేశారు.

తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఓటు వేశారు. చౌదరి దాదాపు దశాబ్దం తర్వాత బీజేపీ టికెట్‌పై తారాపూర్ నుండి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.ఇక ఈ ఎన్నికల్లో 57 స్థానాల్లో JDU, 48 స్థానాల్లో బీజేపీ, 14 స్థానాల్లో LJP పోటీ చేస్తుంది.  8 స్థానాల్లో లోక్‌మోర్చా బరిలో నిలిచింది. మరోవైపు 73 స్థానాల్లో RJD, 24 స్థానాల్లో కాంగ్రెస్,  14 స్థానాల్లో CPI-ML అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక ప్రశాంత్ కిషోర్ జన్‌సురాజ్ పార్టీ నుంచి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Bihar Elections Bihar polling latest news Nitish Kumar Tejashwi Yadav Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.