📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం

Bihar: ఏడాదిన్నరగా కడుపులో కత్తెర.. తీసే క్రమంలో మహిళ మృతి

Author Icon By Saritha
Updated: January 3, 2026 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడాల్సిన చేతులే.. అజాగ్రత్తతో ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. (Bihar) బీహార్‌లో మోతిహారీ జిల్లాలో ఏడాది క్రితం వైద్యులు ఓ మహిళకు కాన్పు చేశారు. సిజేరియన్ (Cesarean) చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు ఆమె కడుపులోనే కత్తెర మరిచిపోయారు. ఆపై కుట్లు వేసి ఇంటికి పంపించి వేశారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో నరకం అనుభవించిన ఆ బాధితురాలు.. చివరికి మరో ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోగా కడుపులో 12 సెంటీ మీటర్ల పొడవైన కత్తెర ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెకు వెంటనే శస్త్రచికిత్స చేసినప్పటికీ.. కత్తెర వల్ల పేగులు దెబ్బతిని ఇన్ఫెక్షన్ రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

Read also: Encounter: పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి

Going in for childbirth turned into a life-threatening situation.

ప్రసవం కోసం వెళ్తే..

బాధితుల కథనం ప్రకారం బీహార్‌లోని మోతిహారీ జిల్లాకు చెందిన మణిభూషణ్ కుమార్‌కు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. (Bihar) వివాహమైన కొంత కాలానికే 25 ఏళ్ల భార్య ఉషాదేవి గర్భం దాల్చగా అంతా మురిసిపోయారు. నెలలు నిండే వరకు ఆమెను చక్కగా చూసుకున్నారు. తమది పేద కుటుంబమే అయినా మంచి వైద్యం ఇప్పించాలని భావించిన మణిభూషణ్ కుమార్ ఆమెను 18 నెలల క్రితం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే డాక్టర్ సంగీత కుమారి ఆధ్వర్యంలో ఆమెకు సిజేరియన్ నిర్వహించగా ఆడబిడ్డ జన్మించింది. అయితే ఆపరేషన్ ముగిసే సమయంలో అత్యంత అజాగ్రత్తగా వ్యవహరించిన సదరు వైద్యురాలు సర్జికల్ కత్తెరను ఉషాదేవి కడుపులోనే మరిచిపోయి కుట్లు వేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Bihar C-Section Complication Healthcare Negligence Latest News in Telugu Medical Malpractice Motihari Patient Death Surgical Negligence Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.