Bihar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగు వేయబోతున్నారు. నిన్న రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన, ఈ నెల 16న ఫలితాలు వెలువడిన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీంతో బిహార్‌లో రెండు దశాబ్దాల నితీశ్ శకం ముగియనుందనే చర్చ మొదలైంది.
Read Also: Assam: గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్
కేంద్ర మంత్రివర్గంలోకి ఎంట్రీ.. ఏ శాఖ దక్కనుంది?
రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత నితీశ్ కుమార్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. అయితే, ఆయనకు రైల్వే వంటి కీలక శాఖను కేటాయిస్తారా? లేక ఆయన ప్రస్తుత అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తక్కువ పని ఒత్తిడి ఉండే అప్రాధాన్య పోస్టుకే పరిమితం చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ నిర్ణయంపైనే నితీశ్ భవిష్యత్ ఆధారపడి ఉంది.
బిహార్ రాజకీయాల్లో వారసుడి రాక.. నిశాంత్ డిప్యూటీ సీఎం?
నితీశ్ కుమార్ కేంద్రానికి వెళ్తుండటంతో, బిహార్‌లో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వంలో ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ కీలక పాత్ర పోషించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నిశాంత్‌ను డిప్యూటీ సీఎంగా నియమించే దిశగా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: