📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: Bihar Results: మోడీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి రుజువు: పవన్ కల్యాణ్

Author Icon By Saritha
Updated: November 15, 2025 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Bihar Results) నాయకత్వంపై ప్రజల విశ్వాసం మరోసారి రుజువు అయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేశారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. శుక్రవారం నాడు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయ కత్వంలోనే దేశ సమగ్రాభివృద్ధి, సుస్థిర పాలన సాధ్యమని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఈ విషయం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయంతో మరోసారి స్పష్టమైందని తెలిపారు. ఆ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి సాధించిన స్థానాలు మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి తార్కాణాలని అభివర్ణించారు. ఇంతటి విజయానికి కారకులైన నరేంద్ర మోడీకి పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

 Read also: బీబీసీపై ట్రంప్ దావాకు సిద్ధం.. క్షమాపణలు చెప్పినా నో

మోడీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి రుజువు: పవన్ కల్యాణ్

అభివృద్ధి సంక్షేమాలే మోడీని గెలిపించాయి

బిహార్ ముఖ్యమంత్రిగా(Bihar Results) సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న నితీశ్కుమార్పట్ల ఆ రాష్ట్ర ప్రజలకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదన్నారు. ఆ రాష్ట్రంలో విద్య, వైద్య ప్రమాణాలను మెరుగుపరచి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుకు వెళ్లారని చెప్పారు. బిహార్లో ఈ విజయానికి కారకులైన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, బిహార్ సీఎం నితీశ్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్కు డిప్యూటీ సీఎం పవన్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AP Deputy CM Bihar Elections Indian Politics Jubilee Hills Bypoll Latest News in Telugu Narendra Modi NDA Victory Pawan Kalyan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.