📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Bihar Results: విజయం వైపు దూసుకెళ్తున్న ఎన్డీఏ

Author Icon By Tejaswini Y
Updated: November 14, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌లో అసెంబ్లీ( Bihar Results) ఎన్నికల ఫలితాల లెక్కింపు కొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. మరో కొన్ని గంటల్లో మొత్తం పిక్చర్ స్పష్టమవుతుంది. ఎగ్జిట్ పోల్స్‌ చూస్తే చాలా వరకు అధికార ఎన్డీయే కూటమికే అనుకూలంగా కనిపించినప్పటికీ, అసలు ఫలితాలపై ఆసక్తి, ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది.

1951 నుంచి ఇప్పటి వరకు బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్. 67.13 శాతం ఓటింగ్ నమోదవడం చారిత్రాత్మక రికార్డ్‌గా నిలిచింది. అభివృద్ధి వర్సెస్ ఆటవిక పాలన అంటూ ఎన్డీయే ప్రచారాన్ని ముమ్మరం చేసినప్పటికీ, ఉపాధి, ఓట్ల దోపిడీ వంటి అంశాలతో మహాగఠ్‌బంధన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం అధికార కూటమికే స్పష్టమైన ఆధిక్యాన్ని సూచించాయి.

Read Also: Bihar Elections: మహాఘట్ బంధన్‌ను వెనక్కి లాగుతున్న కాంగ్రెస్

రెండు దశల్లో పోలింగ్

బీహార్ అసెంబ్లీలో( Bihar Results) మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. వీటిలో రెండు ఎస్టీ, 38 ఎస్సీ రిజర్వ్ సీట్లు. అధికారంలోకి రావాలంటే ఏ పార్టీ లేదా కూటమి అయినా కనీసం 122 సీట్లు సాధించాలి. మొత్తం ఓటర్ల సంఖ్య 7.45 కోట్లు పురుషులు 3.92 కోట్లు, మహిళలు 3.50 కోట్లు.

ఎన్నికలు రెండు విడతల్లో జరిగాయి. రెండు దశల్లోనూ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. పురుషుల పోలింగ్ 62.98%, మహిళల పోలింగ్ 71.78% గా నమోదైంది.

మొదటి దశ (నవంబర్ 6):

  1. 121 సీట్లకు పోలింగ్
  2. 3.75 కోట్ల మంది ఓటర్లు
  3. 1,314 మంది అభ్యర్థులు
  4. 65% కంటే ఎక్కువ పోలింగ్

రెండో దశ (నవంబర్ 11):

  1. 112 సీట్లకు ఓటింగ్
  2. 3.70 కోట్ల మంది ఓటర్లు
  3. 1,302 అభ్యర్థులు
  4. 69% పైగా పోలింగ్

కూటములు – కీలక అభ్యర్థులు

ఎన్డీయే:

  1. జేడీయూ – 101
  2. బీజేపీ – 101
  3. లోక్‌జనశక్తి (రాంవిలాస్) – 28
  4. హిందుస్థానీ అవామ్ మోర్చా – 06
  5. రాష్ట్రీయ లోక్‌మోర్చా – 06

మఢౌరాలో లోక్‌జనశక్తి అభ్యర్థి నామినేషన్ రద్దు కావడంతో, స్వతంత్ర అభ్యర్థి అంకిత్ కుమార్‌కు ఎన్డీయే మద్దతిచ్చింది.

మహాగఠ్‌బంధన్:

  1. ఆర్జేడీ – 143
  2. కాంగ్రెస్ – 61
  3. సీపీఐ (ఎంఎల్) – 20
  4. విఐపీ – 12
  5. సీపీఐ – 09
  6. సీపీఎం – 04
    ఇతర చిన్న పార్టీలతో సహా పలువురు స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు.

కీలక నియోజకవర్గాల్లో ప్రముఖులు:
తేజస్వీ యాదవ్‌ (ఆర్జేడీ – రాఘోపుర్),
సామ్రాట్‌ చౌదరీ (బీజేపీ – తారాపుర్),
విజయ్ కుమార్ సిన్హా (బీజేపీ – లఖిసరాయ్),
తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ (జేజేడీ – మహువా) తదితరులు.

బీహార్ ఎన్నికల తాజా ట్రెండ్స్ – ఎన్డీయే దూకుడు

ప్రాథమిక లెక్కింపులు చూస్తే ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 122ని దాటి ప్రభుత్వ ఏర్పాటు దిశగా పయనిస్తోంది.

తాజా ఎర్లీ ట్రెండ్స్

  1. ఎన్డీయే: 130+ స్థానాల్లో ఆధిక్యం
  2. మహాగఠ్‌బంధన్: దాదాపు 65 స్థానాల్లో ఆధిక్యం
  3. జన్ సూరజ్: 3 సీట్లలో ఆధిక్యం

ఎన్డీయే కూటమిలో:

  1. బీజేపీ – 59
  2. జేడీయూ – 54
  3. మిగతా స్థానాలు మిత్రపక్షాల ఖాతాలో

మహాగఠ్‌బంధన్‌లో:

  1. ఆర్జేడీ – 43
  2. కాంగ్రెస్ – 11
  3. లెఫ్ట్ పార్టీలు – 10

లెక్కింపు కొనసాగుతోంది, కానీ ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ చూస్తే మరోసారి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం బలంగా కనిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Bihar 2025 Election Analysis Bihar Assembly Election Counting Bihar Election Results 2025 Bihar Election Seats Bihar Exit Polls 2025 NDA vs Mahagathbandhan Tejashwi Yadav Latest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.