📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest news: Bihar Results: కుటుంబంతో తెగదెంపులతో పటు రాజకీయాలకు గుడ్‌బై లాలూ కుమార్తె

Author Icon By Saritha
Updated: November 15, 2025 • 4:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో(Bihar Results) మహాకూటమికి వచ్చిన పరాజయం అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్(Lalu Prasad) యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య అనూహ్య నిర్ణయం ప్రకటించారు. ఎన్నో విమర్శలు, కుటుంబ అంతర్గత ఒత్తిడుల నడుమ, రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు, అంతేగాక తన కుటుంబంతో కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నింద అంతా నేను తీసుకుంటాను అని రాసిన ఆమె పోస్టు ఆర్జేడీ కుటుంబంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన తీవ్ర అంతర్గత ఉద్రిక్తతలను బయటపెట్టింది. లాలూ కుమార్తె తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో బీహార్ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Read also: AI పై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

కుటుంబంతో  తెగదెంపులతో పటు రాజకీయాలకు గుడ్‌బై లాలూ కుమార్తె

కుటుంబ కలహాల నేపథ్యమేనా? రోహిణి చేసిన ఆరోపణలు చర్చనీయాంశం

తన రాజకీయ విరమణకు సంబంధించి రోహిణి(Bihar Results) చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సంజయ్ యాదవ్ మరియు రమీజ్ అనే ఇద్దరు వ్యక్తులు పెట్టిన ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఇద్దరు ఎవరనే విషయంపై, లాలూ కుటుంబంలో నిజంగా ఏం జరుగుతోంది అన్న అంశంపై వివిధ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. సారన్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన రోహిణి ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కుటుంబ సభ్యులు లేదా పార్టీ నేతలు తనపై ఒత్తిడి తెచ్చారా? అనే ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఆర్జేడీ కుటుంబంలో వారసత్వం నాయకత్వంపై విభేదాలు ఉన్నాయన్న చర్చలు ఉండగా రోహిణి తీసుకున్న ఈ అడుగు ఆ అంతర్గత అసమ్మతులను మరింత బహిర్గతం చేసినట్లైంది. ప్రస్తుతం రోహిణి చేసిన ఆరోపణలపై లాలూ కుటుంబం, ఆర్జేడీ నాయకత్వం లేదా తేజస్వి యాదవ్ ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. ఆమె చేసిన నిందనంతా నా పైకి తీసుకుంటున్నాను అనే ప్రకటన ఈ వివాదం త్వరగా ముగిసేలా కనిపించడం లేదని సూచిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Bihar Politics lalu prasad yadav Latest News in Telugu Mahagathbandhan Political Controversy RJD Crisis Rohini Acharya Tejashwi Yadav Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.