📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Bihar Results: బీహార్ లో ఎన్డీఏ ఉద్యోగావకాశాలను కల్పించగలదా?

Author Icon By Sushmitha
Updated: November 15, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ ఆర్థికంగా గత దశాబ్దంలో గణనీయమైన పురోగతి సాధించినా, ఆ అభివృద్ధి ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురాగలిగిందా అనేది ఇంకా పెద్ద ప్రశ్నగానే మిగిలింది. 2011-12లో రూ.2.5 ట్రిలియన్ గా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2023-24 నాటికి రూ.8.5 ట్రిలియన్లకు పెరిగి 3.5 రెట్లు విస్తరించింది. అలాగే 2004-05 నటుండి 2023-24 మధ్య తలసరి ఆదాయం ఎనిమిది రెట్టు పెరిగింది.

ఈ గణాంకాలు చూసిన వెంటనే బీహార్ (Bihar Results) అభివృద్ధి చరిత్ర సరికొత్త మలుపు తీసుకున్నదని అందరికీ అనిపించవచ్చు. అయితే వాస్తవానికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. దేశంలో పేదరికం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్ ఇప్పటికీ ముందు వరుసలోనే నిలుస్తోంది. కొన్ని అంశాల్లో దాని పనితీరు మరింత ఆందోళన కలిగించే స్థితిలో ఉంది. అంతేకాకుండా దేశం మొత్తం హెచ్ డీఐ స్కోరును కూడా తగ్గిస్తోంది.

 Read Also: RK Singh: బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సస్పెన్షన్

Bihar Results

పారిశ్రామిక వెనుకబాటు తనం

బీహార్ లోని ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం ఏంటంటే.. ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం. ఇవాళ దేశంలోని పలు రాష్ట్రాల్లో పనిచేసే నిర్మాణ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, సేవల రంగ ఉద్యోగుల్లో పెద్ద భాగం బీహార్ నుంచే వస్తున్నారు. వలస శ్రామికులను పెద్ద ఎత్తున పంపించే ఈ ధోరణి బీహార్ ఎదుర్కొంటున్న పారిశ్రామిక వెనుకబాటు తనాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

భారత (India) దేశంలో చాలా రాష్ట్రాలు పరిశ్రమల అభివృద్ధిని పురోగతికి ప్రధానశక్తిగా ఎంపిక చేసుకున్నా బీహార్ మాత్రం ఆ దిశలో సరైన పురోగతి నమోదు చేయలేదు. మౌలిక సదుపాయాలు బీహార్ కు ఒక నిజమైన అభివృద్ధి మోడల్ను అందించాల్సి బాధ్యత ఎన్ డిఏపైనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, పవర్, లాజిస్టిక్,ఇండస్ట్రియల్ పార్కులు వంటి మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించడం అత్యవసరం. బీహార్ కు అనుకూలమైన రంగాలను చూసుకున్నట్లయితే.. 

ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, లైట్ మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రి-ఆధారిత పరిశ్రమలు వంటి వాటిని గుర్తించి ప్రత్యేక పోత్సాహాలు ఇవ్వాలి. బీహార్ కూడా ఇలాంటి దిశగా ముందడుగు వేస్తేనే, అక్కడి ప్రజలు తమ స్వస్థలంలోనే మంచి ఉద్యోగాలను పొందే రోజు రానుంది. ఎన్ డిఎ ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ఆర్థిక దిశను మార్చడానికి బలమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Bihar Elections 2025; economic policy employment promises Google News in Telugu job creation Latest News in Telugu NDA government political analysis. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.