బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Results) ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం దాదాపు ఖరారైంది. మొత్తం 234 స్థానాల్లో సుమారు 200 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నితీశ్ కుమార్(Nitish Kumar) మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అనివార్యంగా కనిపిస్తోంది. ఒకవేళ ఆయన పదవి చేపడితే, ఇది ఆయనకు పదవసారి ముఖ్యమంత్రి పదవి అవుతుంది. 2005 నవంబర్ 24 నుండి ఇప్పటివరకు 2025 ఆయన సుదీర్ఘంగా దాదాపు 20 ఏళ్లకు పైగా సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. అయితే, నితీశ్ వయస్సు మరియు ముఖ్యమంత్రి పదవి యొక్క ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఆయన బాధ్యతలు తీసుకోకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read also: ప్రసిద్ధ నటి కామిని కౌశల్ కన్నుమూత!
సీఎం రేసులో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి
బీహార్‌లో ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడంలో బీజేపీ నాయకులు గణనీయంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీ నాయకులకే దక్కాలని కమలదళం పట్టుబట్టే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లఖిసరాయ్ శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయ్ కుమార్ సిన్హా పేరు కూడా సీఎం రేసులో చురుగ్గా చర్చల్లో ఉంది. ఆయన ప్రస్తుతం బీహార్ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీహార్‌లో బీజేపీ నాయకులు చేసిన కృషికి తగిన ఫలితం దక్కలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్‌ను పరిశీలిస్తే, బీజేపీ అభ్యర్థులు 95 స్థానాల్లో, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ అభ్యర్థులు 84 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
మహారాష్ట్ర ఫార్ములా పునరావృతం?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Bihar Results) సమయంలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదు. మెజార్టీ సీట్లు వచ్చిన తర్వాత, శివసేన భాగస్వామి ఏక్‌నాథ్ షిండేకు కాకుండా, బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. బీహార్‌లో కూడా అదే దృశ్యం పునరావృతం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బీజేపీ నుంచి శక్తిమంతమైన నాయకులైన సామ్రాట్ చౌదరి లేదా విజయ్ కుమార్ సిన్హా ఇద్దరిలో ఒకరికి ముఖ్యమంత్రి అవకాశం దక్కవచ్చని అంచనా.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: