हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Bihar Results: బీహార్ ఫలితాలు..తేజస్వీకి దక్కని CM కుర్చీ

Tejaswini Y
Bihar Results: బీహార్ ఫలితాలు..తేజస్వీకి  దక్కని CM కుర్చీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Results) 2025 ఫలితాలు మహాఘట్‌బంధన్‌కు మరోసారి నిరాశను మిగిల్చాయి. రాష్ట్రం మొత్తంలో ప్రజలు ఎన్డీఏ పక్షానే నిలిచినట్లు తాజా లెక్కలు సూచిస్తున్నాయి. బీజేపీ, జేడీయూ అభ్యర్థులు మెజారిటీ మార్క్‌ను దాటుతూ అనేక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 243 నియోజకవర్గాల్లో దాదాపు 190 చోట్ల ఎన్డీఏ ముందంజలో ఉండటంతో ఈ ఎన్నికల్లో బిహారీలు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్లే కనిపిస్తోంది.

బిహార్ రాజకీయాల్లో యువ నాయకుడిగా ఎదిగిన తేజస్వీ యాదవ్‌కు(TejashwiYadav) మళ్లీ సీఎం కుర్చీ దక్కే అవకాశాలు దూరమయ్యాయి. 2017 తర్వాత ఇది ఆయనకు సీఎం అయ్యే అవకాశం చేజారిన మూడో ప్రధాన సందర్భం. రెండు సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినా, రాజకీయం మారిన ప్రతిసారి ఆయన స్వప్నం నెరవేరకుండా ఉంది.

Read Also:  Kurnool: కర్నూలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు

2017 నితీష్ కుమార్ అనూహ్య నిర్ణయం

Bihar Results: 2017లో తేజస్వీకి సీఎం పదవి అతి చేరువలోకి వచ్చి మళ్లీ దూరమైంది. 2015 ఎన్నికల్లో ఆర్జేడీ,జేడీయూ,కాంగ్రెస్ మహాఘట్‌బంధన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాగా, తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే తేజస్వీపై వచ్చిన అవినీతి ఆరోపణలను కారణంగా చూపుతూ నితీష్ అకస్మాత్తుగా కూటమి నుంచి నిష్క్రమించారు. వెంటనే జేడీయూ ఎన్డీయేలో చేరడంతో తేజస్వీ పదవి కోల్పోయి ప్రతిపక్ష నాయకుడిగా మారారు. ఈ నిర్ణయంతో ఆయనకు సీఎం అయ్యే అవకాశం పూర్తిగా తగ్గిపోయింది.

2020 కాంగ్రెస్ వైఫల్యం కీలకం

తేజస్వీకి రెండో పెద్ద అవకాశం 2020 ఎన్నికలు. నిరుద్యోగం, 10 లక్షల ఉద్యోగాల వాగ్దానంతో ఆయన భారీ ప్రచారం నిర్వహించారు. ఆర్జేడీ 75 సీట్లను గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే కూటమిలో కీలకపాత్రలో ఉన్న కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితమవడంతో మహాఘట్‌బంధన్ మెజారిటీ మార్కు చేరుకోలేదు. కాంగ్రెస్ దుర్బల ప్రదర్శన కారణంగా కూటమి కీలక సీట్లను కోల్పోయింది. ఫలితంగా ఎన్డీయే 125 సీట్లతో తిరిగి అధికారాన్ని కాపాడుకుంది. కేవలం కొన్ని సీట్లు దూరంలోనే తేజస్వీకి సీఎం పదవి మళ్లీ చేజారిపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870