Forced marriage india : బీహార్‌లో మరోసారి ‘పకడ్వా వివాహ్’ ఘటన కలకలం రేపింది. సమస్తిపూర్ జిల్లాకు చెందిన పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న 22 ఏళ్ల నితీశ్ కుమార్‌ను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 7న లైబ్రరీకి వెళ్తుండగా అతడిని అపహరించి, మత్తు మందు ఇచ్చి మొర్వా గ్రామంలోని ఆలయంలో లక్ష్మీ కుమారితో వివాహం జరిపించినట్లు సమాచారం.
బందీగా ఉన్న సమయంలో నితీశ్ రహస్యంగా తీసిన వీడియో కుటుంబ సభ్యులకు చేరడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని రక్షించి కుటుంబానికి అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Also: TamilNadu: ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ మెజార్టీ సాధిస్తామన్న విజయ్
అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని వధువు కుటుంబం వాదిస్తోంది. కట్న భారం తప్పించుకోవడానికి ఇలాంటి బలవంతపు వివాహాలు జరుగుతాయని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, పాట్నా హైకోర్టు గతంలో బలవంతంగా జరిగిన పెళ్లిళ్లు చట్టబద్ధం కాదని స్పష్టం చేసిన విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: