📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Telugu News: Bihar: బీహార్‌ ఎన్నికలో మోదీ  రాహుల్ ఒకరి పై ఒకరు విమర్శలు

Author Icon By Sushmitha
Updated: October 30, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీల అగ్రనేతల పర్యటనలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) నేడు ముజఫర్‌పూర్, ఛప్రాలో రెండు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వారా ఎన్డీఏ కూటమి తన ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేయనుంది.

 Read Also: TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు నేటి నుంచి స్వీకరణ

మోదీ ధీమా, ప్రచార వివరాలు

ప్రధాని మోదీ ‘ఎక్స్’ (X) వేదికగా స్పందిస్తూ, బీహార్‌లో బీజేపీ-ఎన్డీఏ కూటమి సంపూర్ణ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “బీహార్‌లోని నా కుటుంబ సభ్యులే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం కోసం స్వయంగా బరిలోకి దిగారు” అని ఆయన పేర్కొన్నారు. మోదీ ఈ ఉదయం 11 గంటలకు ముజఫర్‌పూర్‌లో, మధ్యాహ్నం 12:45 గంటలకు ఛప్రాలో ప్రజలతో సంభాషించనున్నారు. “రాష్ట్రంలోని నా సోదర సోదరీమణులు మరోసారి విజయ శంఖాన్ని పూరిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది” అని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ విమర్శలు

మరోవైపు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బుధవారం ముజఫర్‌పూర్‌లో జరిగిన మహాఘట్‌బంధన్ ఉమ్మడి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. “ఆయనకు (మోదీకి) కేవలం మీ ఓటు మాత్రమే కావాలి. ఓట్ల కోసం డ్రామా చేయమంటే చేస్తారు. నరేంద్ర మోదీని డ్యాన్స్ చేయమన్నా చేస్తారు” అంటూ రాహుల్ విమర్శించారు. అంతేకాకుండా, “వారు మీ ఓట్లను దొంగిలించే పనిలో ఉన్నారు. మహారాష్ట్ర, హర్యానాలలో ఎన్నికలను దొంగిలించారు. ఇప్పుడు బీహార్‌లోనూ అదే ప్రయత్నం చేస్తారు” అని రాహుల్ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కూడా బుధవారం ఎన్డీఏ తరఫున పలుచోట్ల ప్రచార ర్యాలీలు నిర్వహించారు.

ఎన్నికల షెడ్యూల్, ప్రధాన పోటీ

2025 బీహార్ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ, మహాఘట్‌బంధన్ కూటముల మధ్య నెలకొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రశాంత్ కిషోర్ ‘జన్ సురాజ్’ పార్టీ కూడా రాష్ట్రంలోని 243 స్థానాల్లో పోటీ చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Amit Shah Bihar Assembly Elections 2025 Bihar Elections Google News in Telugu Latest News in Telugu Mahagathbandhan Narendra Modi NDA alliance rahul gandhi Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.