Bihar: హిజాబ్ వివాదం.. విధుల్లో చేరని వైద్యురాలు

Read Time:  1 min
Bihar
Bihar
FONT SIZE
GET APP

బీహార్ లో నెలకొన్న హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ వేదికపై నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఓ ముస్లిం వైద్యురాలు హిజాబ్ ధరించుకుని వేదికపైకి వచ్చింది. అయితే నితీష్ కుమార్ పత్రాన్ని అందజేసే క్రమంలో వైద్యురాలి హిజాబ్ తొలగించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ఒక మహిళ హిజాబ్ ను ఎలా తొలగిస్తారంటూ విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో నీతీష్ కుమార్ ప్రభుత్వం తప్పును సరిదిద్దుకునే యత్నం చేసింది.

Read also: Pralay Missile: ఒడిశా తీరంలో ‘ప్రళయ్’ మిసైల్ ట్రయల్ విజయవంతo

Bihar

Bihar

అపాయింట్ మెంట్ ను రద్దు చేస్తాం

ఇదిలా ఉంటే ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్న సదరు వైద్యురాలు సుస్రత్ పర్వీన్ ఇప్పటివరకు విధుల్లో చేరలేదని అధికారులు వెల్లడించారు. అయితే నియామక పత్రాలు అందుకున్న వైద్యులంతా గురువారంలోపు (జనవరి 1) చేరాలని డెడ్ లైన్ ఉంది. అది మరికొన్ని గంటల్లో ముగియనుంది. కానీ వైద్యురాలి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఆమె సబల్ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల్లో చేరాల్సి ఉండగా ఎటువంటి సమాచారం లేదని స్థానిక అధికారులు వెల్లడించారు.

ఈరోజు ఆ వైద్యురాలు విధుల్లో చేరకపోతే ఆమె అపాయింట్ మెంట్ ను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే హిజాబ్ వివిదం తర్వాత వైద్యురాలి కుటుంబం బీహార్ ను విడిచిపెట్టి పశ్చిమబెంగాల్ కు మకాం మార్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. నితీష్ కుమార్ ప్రవర్తనకు విస్తూపోయిన సదరు వైద్యురాలు దీనిపై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఈ అవమానంపై ఆమె మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాలు నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శల్ని గుప్పించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.