బిహార్(Bihar Elections) తొలి దశ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ శాతం చరిత్ర సృష్టించింది. 20 ఏళ్లలో తొలిసారి 64.66% ఓటింగ్ నమోదైంది. ఈ సంఖ్య రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
ప్రజాస్వామ్యంలో అధిక ఓటింగ్ అంటే మార్పు కోరిక అని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) అభిప్రాయపడ్డారు. “ప్రజల్లో అసహనం, ఆగ్రహం పెరిగితే వారు బలంగా పోలింగ్ బూత్‌లకు వెళ్తారు,” అని ఆయన తెలిపారు.
Read Also: Bihar Election: బీహార్‌లో మా పార్టీయే గేలుస్తుంది:ప్రశాంత్ కిశోర్
గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ పెరుగుదల
1998లో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో 64% ఓటింగ్ నమోదు కాగా, ఆ తర్వాత అధికార మార్పు జరిగింది. 2000లో బిహార్ ఎన్నికల్లో(Bihar Elections) 62% ఓటింగ్‌తో అదే రిపీట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ కనబడుతుందా అనే ప్రశ్న అందరిలో ఉత్కంఠ రేపుతోంది.
రాజకీయ పార్టీలు ఆందోళనలో
భారీ ఓటింగ్ నేపథ్యంలో అధికారపక్షం కొంత భయాందోళనలోకి వెళ్లగా, ప్రతిపక్షం మాత్రం ఉత్సాహంగా ఉంది. అధిక ఓటింగ్ అంటే ప్రజల్లో మార్పు కోరిక అనే భావనతో ప్రతిపక్ష నేతలు తమ విజయంపై నమ్మకంగా ఉన్నారు. మొదటి దశ ఓటింగ్ శాతం చూసి రెండవ, మూడవ దశల్లో పోలింగ్ రేటు ఎలా ఉండబోతుందో అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇది మొత్తం ఎన్నికల ఫలితాలపై కీలక ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: