బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections) కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 71 మంది అభ్యర్థులు ఉన్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని తారాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. బీజేపీ ఈ జాబితాలో తొమ్మిది మంది మహిళలకు టిక్కెట్లు కేటాయించింది. వీరిలో ప్రముఖ నేతలు రేణు దేవి (బెట్టియా), గాయత్రి దేవి (పరిహార్), దేవంతి యాదవ్ (నరపత్‌గంజ్), స్వీటీ సింగ్ (కిషన్‌గంజ్), నిషా సింగ్ (ప్రాన్పూర్), కవితా దేవి (కోధా), రామ నిషాద్ (ఔరై), అరుణా దేవి (వార్సలిగంజ్), శ్రేయసి సింగ్ (జముయి) ఉన్నారు.
Read Also: Drugs:పైకి ఫుడ్ టిన్‌లు.. లోపల చూస్తే అవ్వాక్కే
ఈ జాబితాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi,) రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్న కేంద్ర ఎన్నికల(Bihar Elections) కమిటీ సమావేశం అనంతరం ప్రకటించారు.
243 సభ్యులున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి.
- మొదటి దశ: నవంబర్ 6
- రెండో దశ: నవంబర్ 11
- ఓట్ల లెక్కింపు: నవంబర్ 14
ఎన్డీఏ కూటమిలో భాగంగా, బీజేపీ మరియు జేడీయూ చెరో 101 సీట్లలో, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లలో పోటీ చేయనున్నాయి. అదనంగా, రాష్ట్రీయ లోక్ మోర్చా మరియు హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) కి ఆరేసీట్లు చొప్పున కేటాయించారు. ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం జేడీయూ, బీజేపీ, ఎల్‌జేపీ (రామ్ విలాస్), హెచ్ఏఎమ్ (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి.
బీహార్ ఎన్నికల బీజేపీ తొలి జాబితాలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు?
మొత్తం 71 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు.
ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు?
తారాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: https://epaper.vaartha.com/
Read Also: