Bihar Elections: బురఖా ఓటర్లపై నిఘా .. గిరిరాజ్ సింగ్

Read Time:  1 min
Giriraj Singh
Giriraj Singh
FONT SIZE
GET APP

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు గిరిరాజ్ సింగ్(Giriraj Singh) మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. బీహార్ ఎన్నికల(Bihar Elections) ప్రచారంలో పాల్గొన్న ఆయన, బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయాలి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దొంగ ఓట్లను అడ్డుకోవడమే లక్ష్యమని గిరిరాజ్ సింగ్ వివరణ ఇచ్చినా, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Read Also: Bihar Elections 2025: బిహార్‌లో మొదలైన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

బేగూసరాయ్ ఎంపీగా ఉన్న గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, “సందేహాస్పదంగా కనిపించే బురఖా ధరించిన ఓటర్లను కచ్చితంగా తనిఖీ చేస్తాం. దీని కోసం మా బృందం నిఘా పెడుతుంది” అని తెలిపారు. అంతటితో ఆగకుండా, “ఇది బీహార్.. పాకిస్థాన్ కాదు. ఇక్కడ షరియా చట్టం నడవదు” అంటూ వ్యాఖ్యానించారు.

Bihar Elections
Bihar Elections

Bihar Elections: ఈ వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో మతపరమైన చర్చలకు దారితీస్తూ పెద్ద వివాదంగా మారాయి. ఇది గిరిరాజ్ సింగ్‌కు కొత్త విషయం కాదు. గత ఎన్నికల సమయంలోనూ ఆయన మతపరమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రతిసారీ ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించి విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

గతంలో గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ప్రస్తుత వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు బీహార్‌లో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.