ఎన్నికల్లో(Bihar elections) గెలిచేందుకు ఎన్డీయే సర్కారు విభజన రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఆరోపించారు. నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తోందని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించలేకపోవడంతోనే ఓట్ల చోరీకి పాల్పడుతోందని భాజాపాపై మండిపడ్డారు. ఓట్ల తొలగింపు అనేది హక్కుల ఉల్లంఘనతో సమానమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెగుసరాయ్ లో తన తొలి ప్రచార సభలో ఈ మేరకు ప్రసంగించారు.
Read also: మెట్రో రైళ్ల టైమింగ్స్ మార్పు
దేశాభివృద్ధికి తోర్పడిన బీహార్
దేశాభివృద్ధికి బిహార్(Bihar elections) ఎంతో దోహదపడింది. కానీ, రాష్ట్రాభివృద్ధి విషయంలో మాత్రం వెనుకబడిపోయింది. నెహ్రూ,ఇందిరా గాంధీలను భాజపా నేతలు విమర్శిస్తున్నారు. నిరుద్యోగం, వలసల వంటి అసలైన సమస్యలను పట్టించుకోవడం లేదు. విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీపై ప్రియాంక మండిపడ్డారు. బిహార్ ను ఢిల్లీ నుంచి నియంత్రిస్తారని, ఎన్డీయే పాలనలో ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ విజయాన్ని సాధిస్తుందని, బీజేపీ కోటి ఉద్యోగాల హామీపై స్పందిస్తూ ఇన్నేళ్ల పాలనలో ఏం చేసిందని ప్రియాంక ఎద్దేవా చేశారు. ఈనెల 6,11 రెండు విడతలుగా బిహార్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది రాజకీయపార్టీలు తమ ప్రచారంలో మునిగిపోయాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: