యుపి తర్వాత 13.1కోట్ల జనాభా తో రెండో పెద్ద హిందీ రాష్ట్రం బీహార్ 18వ (Bihar elections) శాసనసభకు త్వరలో జరుగనున్న ఎన్నికలలో గెలవడానికి మోడీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి, కాంగ్రెస్అధినేత రాహుల్, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ రెండో కుమారుడు ఆర్జేడి అధిపతి తేజస్వి యాదవ్నాయకత్వలోని ప్రతిపక్ష కూటమి మహాగట్ బంధన్ (Mahagat Bandhan)నువ్వా.. నేనా అనేరీతిలో తలపడుతున్నాయి. సామాజిక న్యాయం,కులఅస్తిత్వాల ప్రభావం అధికంగా ఉన్న బీహార్, తమిళనాడుల పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఇన్నాళ్లు వ్యతిరేకిస్తూవచ్చిన కులగణనకు ప్రధాని మోడీ ఆమోదం తెలపడం అధికార కూటమికి అనుకూలం కాగలదని భావి స్తున్నారు.సుపరిపాలనాదక్షుడిగా పేరు గాంచిన సోషలిస్టు నితీష్ కుమార్ 2సార్లు కూటములు మార్చినా, 10 నెలల పాటు మహాదళిత నేత జితన్ రామ్ మాంజికి సీఎం పదవి అప్పగించడం పోను గత20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే వున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే 6సార్లు బీహార్లో పర్యటించి నితీష్తో కలసి ఎన్నోఅభివృద్ధి, సంక్షేమ పథకాలుప్రకటించి, కొన్నిప్రారంభించి బీహారీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా ఎన్నికల సంఘం అధి కార కూటమికిలబ్ధి కలిగేలా ఓటర్ల జాబితా నుండి అర్హులైన లక్షలాదిమందిని తొలగిస్తూ ఉందని ఆరోపిస్తూ తేజస్వి యాదవ్తో కలిసిరాహుల్ జరిపిన ఓటు చోరీ వ్యతిరేక యాత్రకు ప్రజలు తండోపతండాలుగా హాజరుకావడం విశే షం. అయితే కాంగ్రెస్అక్రమ వలసదార్లను దేశంలో తిష్ట వేసి మన వనరులు కబళించేలా ప్రోత్సహిస్తోందని మోడీ, కేంద్ర హోంమంత్రిఅమిత్ షాలు ధ్వజమెత్తుతుండగా గత 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా అసమర్ధ బిజెపి సర్కార్ అక్రమవలసలు నిరోధించలేకపోయిందని కాంగ్రెస్, ఆర్జేడీ ఎదురు దాడిచేస్తున్నాయి. మహాగట్బంధన్ గెలిస్తే మళ్లీ లాలూకాలం నాటి ఆటవిక పాలన వస్తుందని అధి కార కూటమి హెచ్చరిస్తుండగా రెండింజన్ల పాలనలో శాంతిభద్రతలుక్షీణించాయని, నిరుద్యోగం పెరిగి బిహారీల వలసలు, ద్రవ్యోల్బణంతో ధరలు పెరిగి శాంతిభద్రతలు క్షీ ణించి మహిళలు భీతిల్లున్నారని ప్రతిపక్ష కూటమి ఆరోపి స్తోంది. 2020 శాసనసభ ఎన్నికలు కూడా 2 కూటముల మధ్య హోరాహోరీగా జరిగి చెరి 37 శాతం ఓట్లు సాధించా యి. మజ్లిస్ పార్టీ పోటీకి దిగి ఉత్తర బీహార్లో (Bihar elections) 5సీట్లు గెలవడంతో మైనారిటీ ఓట్లు తగ్గి గట్బంధన్ అధికారానికి దూరం కావలసి వచ్చింది. రెండు కూటముల మధ్యఓట్ల తేడా 11వేలే.
గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ 144 స్థానాలకు పోటీ చేసి 75 స్థానాలు గెలవగా, బిజెపి 101 స్థానాలకు పోటీ
చేసి74 సీట్లు గెలిచి రెండో పెద్దపార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 70 సీట్ల కు పోటీ చేసి కేవలం 19స్థానాలే గెలిచినందునఈసారి 50 స్థానాలకే పరిమితం చేసికూటమిలో కొత్తగా చేరిన ముకేశ్ సహానీ నాయకత్వంలోని నిషదుల వికాస్ సీల్ఇన్సాఫ్ (విఐపి) పార్టీకి కనీసం డజన్ స్థానాలు కేటాయించా లని తేజస్వి యాదవ్ తలపోస్తున్నారు. గత ఎన్నికలలో 19స్థానాలకు పోటీచేసిన మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ 12 స్థానా లు గెలవగా 6 స్థానాలకే పోటీ చేసిన సీపీఐ 4స్థానాలకుపోటీ చేసిన సిపిఎం చెరి 2 సీట్లు గెలిచాయి. 2020లో కూడా నితీష్ ప్రాభవాన్ని తగ్గించడానికి బిజెపి కుతంత్రంపన్ని చిరాగాశ్వాన్ ఎస్జేపిని ఎగదోసి 137 స్థానాలకు అదీ జేడీయు పోటీ చేస్తున్న చోట్ల పోటీ పెట్టడంతో జేడీయు43 స్థానాల్లో మాత్రమే గెలిచినా బిజెపికి తగిన సారథి లేక మళ్లీ నితీశ్ కే పట్టంకట్టక తప్పలేదు. ఈసారి కూడా అదేపన్నాగంలో భాగంగానే కమలనాథులు నితీష్ పేరుని ఎన్డీ యే సీఎం అభ్యర్థిగా ప్రకటించడం లేదనే ఆరోపణలున్నాయి. అయితే నితీశ్ తప్ప మరొకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని జేడీయూ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఝాస్పష్టం చేశారు. కమలనాథులు నోరుమెదపడం లేదు. అందు కే చిరాగ్ పాశ్వాన్ మొత్తం 243 స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. గత లోక్సభ ఎన్నికలలో ఎన్డీయే 30సీట్లు గెలిచింది. పాశ్వాన్ ఎల్జీపి5, బిజెపి 12, జేడీయూ12, మాంజీ హిందుస్తాన్ అవామీ ఒక్క ఎంపీ స్థానాలు గెలి చాయి. గత గబ బంధన్ 9ఎంపీ స్థానాలు గెలవగాఅందులో ఆర్జేడి 4, సిపిఎంఎల్ 2కాంగ్రెస్ 3స్థానాలు దక్కించుకున్నా యి. ఇండిపెండెంట్గా పప్పుయాదవ్గెలిచారు. బీహార్సామా జిక స్వరూపాన్ని పరిశీలిస్తే దాదాపు 20 శాతం దళితులుకాగా వారిలో పాస్వాన్లు5శాతం, ముసాహర్లు 3 శాతం, ఇతర దళిత కులాలవారు 10శాతం, 1.8శాతం ఎస్టీలు ఉన్నారు. 15.5శాతం ఉన్నఅగ్రవర్ణాలు ప్రధానంగా బిజెపికి స్థానిక నాయకత్వాలు బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ వైపు మొగ్గు చూపు తున్నారు.బ్రాహ్మణులు 3శాతం, భూమిహారులు2.8 శాతం కాయస్థులు 0.6 శాతం ఉన్నారు. వీరిలో అత్యధికులు మోడీ నితీశ్ మద్దతుదారులు. 27 శాతం బిసిలలో యాదవు లు 14శాతం కాగా ముస్లింలు 17 శాతం ఉన్నారు. వీరు ప్రధానంగా ఆర్జేడి, కాంగ్రెస్ మద్దతుదారులు. దాదాపు 3 శాతం ఉన్న కూర్మిలు, 4శాతం ఉన్న కుస్వాహాలు బీహార్ (Bihar elections)ఉత్తర ప్రాంతంలోఎన్డీఏకు, దక్షిణప్రాంతంలో మహాగ బంధన్ కు ఓటేయవచ్చని అంచనా.
7 శాతం ఉన్న తెలి, కాను, బిసి బనియాలు ఎక్కువగా ఎన్డీఏ వైపు మొగ్గు చూపవచ్చు మైనారిటీలు ఎక్కువగా ఉండే సీమంచల్ ప్రాంతంలో మజ్లిస్ పోటీచేస్తే గట్బంధన్ ఓట్లు చీలి ఎన్డీయేకు లాభించవచ్చు. నితీష్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2006 నుండి పంచాయతీలలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, బేటీ బచావ్.. బేటీ పడావ్ కార్యక్రమం కింద 9వ తరగతి నుండి డిగ్రీవరకు రూ. 94,100 ఒక్కోబాలిక ఖాతాల్లో జమచేస్తూ వచ్చారు. బాలికలకు 9వ తరగతి నుండి ఉచితసైకిళ్లు, ఆర్థిక సాయం అందిస్తూ మహిళల అక్షరాస్యత 20శాతం పెరిగేలా చేశారని మన్ననలు పొందారు. 2006లోనే నితీష్ ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకాలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించింది. 2005లో గెలిచాక గృహహింస చట్టాలు కఠినతరం చేయడంతో అవి తగ్గి మహిళలకు ఎంతో ఊరట నిచ్చాయి. మహిళలు సొంతవ్యాపారాలు చేసుకోవడానికి ఒక్కోమహిళకు రూ.10వేలు ఆర్థికసాయం పంపిణీచేస్తూ వారి ఇళ్లలోదసరా పండుగ సంబరాలు నింపుతున్నారు. అయినా బిహార్ అసెం బ్లీకి కేవలం 26మంది, అంటే 10శాతం మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు. బీహార్ జనాభాలో సగం మంది 25ఏళ్ల యువత. జనాభా అధికంగా ఉండటంతో ఉ
ద్యోగ ఉపాధి కోసం బయటిప్రాంతాలకు వలస వెళుతున్నందున ఓటింగ్ లో మహిళలే అధికంగా పాల్గొంటున్నారు. ప్రతివెయ్యిమంది పురుషులకు 918 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. రాహుల్, తేజస్విల ఓట్ల చోరీ జరిగిందనే ప్రచారం సంచల నం కలిగించింది. అందులో ఎంత మాత్రం నిజంలేదని కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ ఖండిస్తున్నాఅనుమానాలు తొలగిపోలేదు. ఇప్పటివర కు98శాతం పైగా అంటే 7,89,68,844 రిజిస్టర్డ్ ఓటర్ల తనిఖీ, డిజిట లైజషన్ పూర్తయిందని, 20లక్షల మంది ఓటర్లు మరణించారని, 28 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లారని, 4.7లక్షలమంది 2 చోట్ల ఓటర్లుగా నమో దయ్యారని, మొత్తం ఓటర్లు 7.9 కోట్లు కాగా వారిలో 4.5 శాతం వారి నివాసాలలో లేరని యెన్నికల సంఘం ధృవీకరించింది. ఎన్డీయే, మహా గట్ బంధన్ల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లున్నది. ఓట్ల తేడా ఒక్క శాతం గనుక ఇంకా నెలరోజులు పైగా వ్యవధి ఉన్నం దున, ప్రధాని మోడీ, నితీష్, రాహుల్, తేజస్విలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మక మైనవి. వాగ్ధాటిలో, ఎన్నికల మంత్ర, తంత్రాలలో ప్రధాని మోడీ మేటి గనుక, తన ప్రచార ధాటి తో, మరిన్ని ఎన్నికల వాగ్దానాలతో ఎన్డీయేను ఆయన మళ్లీ విజయ పంథాన నడిపిస్తారని అధికార కూటమి అభిమా నులు విశ్వసిస్తూన్నారు ఎన్నికల సర్వేక్షకుడు ప్రశాంత్ కిషోర్ కొత్తగా (ప్రారంభించి నరంభించిన జన సురాజ్ పార్టీ గెలిచేంత ప్రభావం చూపలేకపోయినా ఏమేరకు, ఎంత శాతం ఎన్డీయే ఓట్లు చీలుస్తుందనేది వేచి చూడాల్సిందే. తేజస్విపై యువత మొగ్గు ఉన్నా మరికొన్ని ఇతర సామా జిక వర్గాలను కూడగట్టడం, భాగస్వామ్య పక్షాల మధ్య సజావుగా సీట్ల సర్దుబాటు పైనే, గట్బంధన్ విజయావకా శాలు ఆధారపడి
ఉంటాయి. ప్రధాని మోడీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే గనుక ఆయన విజయసాధనకు గట్టి ప్రయత్నాలే చేస్తారు. అక్టోబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మరింత స్పష్టత రావచ్చు.
-పతకమూరు దామోదర్ ప్రసాద్
బీహార్ శాసనసభ పదవీకాలం?
రాజ్యాంగం ప్రకారం బీహార్ శాసనసభ రద్దు తేదీలు ఈ క్రింద వివరించబడ్డాయి. ప్రతి విధానసభకు మొదటి సిట్టింగ్ తేదీ, గడువు ముగిసిన తేదీ రాజ్యాంగం ప్రకారం రద్దు తేదీలు (వరుసగా) భిన్నంగా ఉండవచ్చు.
బీహార్ శాసనసభ పనికాలం?
బీహార్ శాసనసభ శాశ్వత సంస్థ కాదు. రాజ్యాంగం ప్రకారం రద్దుకు లోబడి ఉంటుంది. శాసనసభ పదవీకాలం త్వరగా రద్దు చేయబడని పక్షంలో దాని మొదటి సమావేశానికి నియమించబడిన తేదీ నుండి కాలపరిమితి ఐదు సంవత్సరాలుగా ఉంటుంది. శాసనసభ సభ్యులు నేరుగా ప్రజలచే ఎన్నుకోబడతారు. ప్రతి సంవత్సరం సమావేశాలు మూడు థపాలుగా జరుగుతాయి (బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాలపు సమావేశాలు) ఉంటాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: